7 వామపక్షాల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఏడు వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. పోరాడి సాధించుకున్న ఈ చట్టాన్ని నీరుగా ర్చే ప్రయత్నాలను తిప్పికొట్టనున్నట్లు హెచ్చ రించాయి. మంగళవారం మగ్దూంభవన్‌లో జరిగిన సమావేశంలో సబ్‌ప్లాన్ పేరు మార్పుతోపాటు, నీరుగార్చే ప్రయత్నాలపై చర్చించినట్లు, ఈ చట్ట పరిరక్షణకు అన్ని ప్రయత్నాలు సాగించాలని నిర్ణయించారు.
ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే వామపక్ష పార్టీలు, దళిత, ఆదివాసీ సంస్థలు, మేధావులను కలుపుకుని పెద్దఎత్తున ఉద్యమాన్ని సాగించాలని నిర్ణ యించినట్లు ప్రకటించారు. చాడ వెంకటరెడ్డి (సీపీఐ), జి.నాగయ్య(సీపీఎం),కె.గోవర్దన్ (న్యూడెమోక్రసీ–చంద్రన్న), రాంచందర్ (న్యూడెమోక్రసీ),ఉపేందర్‌రెడ్డి (ఎంసీపీఐ– యూ),మురహరి(ఎస్‌యూసీఐ–సీ), జానకి రాములు (ఆర్‌ఎస్‌పీ) పాల్గొన్నారు.