- పాలమూరు జిల్లాలో వర్ష బీభత్సం
సాక్షి నెట్‌వర్క్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం దేపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలం గౌడ్ (48) వర్షం వస్తుండగా చెట్టుకింద నిల్చున్నాడు. ఒక్కసారిగా అతనికి సమీపంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం గట్టుకాడిపల్లికి చెందిన అల్వాల ఆంజనేయులు (60) పొలంలో నీరు పెడుతుండగా వర్షం రావడంతో మామిడి చెట్టు కిందకు వెళ్లాడు. పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
నవాబుపేటమండల పరిధిలోని హజిలాపూర్‌లో బోయిని నారాయణ అనే రైతుకు చెందిన రెండు పాడి గేదెలు పిడుగు పాటుకు మృతి చెందాయి. రుద్రారం గ్రామానికి చెందిన దండు వెంకటయ్య ఎద్దు కూడా పిడుగుపాటుకు చనిపోయింది. బాలానగర్ మండలం పెద్దాయపల్లి పరిధిలోని సేరిగుడ శివారులో పిడుగుపడడంతో చెట్టుకింద తలదాచుకుంటున్న చాకలి బాలమణి, ఈటమోని నర్సింహులు అస్వస్థతకు గురయ్యారు.
సీబెల్కొ పరిశ్రమలో పిడుగు పడటంతో అక్కడున్న కార్మికులు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు గండేడ్ మండలం గాధిర్యాల్ గ్రామానికి చెందిన మహిపాల్‌రెడ్డి గేదెలు పొలంలో మేస్తుండగా గాలికి తెగిన తీగలకు తగిలి అక్కడే మృతిచెందింది. రెడ్డిపల్లి గ్రామ శివారులో పిడుగుపాటుకు చాపల తిరుపతయ్యకు చెందిన గేదె మృత్యువాత పడింది. నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరులో విద్యుత్‌తీగలు తెగిపడి ఐదు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి.