lightening
-
సబ్జాతో ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది!
మంచి ఆరోగ్యకరమైన ఆహారం అనగానే కూరగాయాలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ ఇవే గుర్తోస్తాయి. కానీ వీటితోపాటు ఆరోగ్యానికి మంచివి, కొన్ని వ్యాధుల తీవ్రం కాకుండా నిరోధించే మంచి ఔషధగుణాలు కలిగినవి కూడా ఉన్నాయి. వాటిలో ఈ సబ్జగింజలు ఒకటి. వీటిని బేసిల్ విత్తనాలు అని కూడా అంటారు. ఇవి ఆరోగ్యానికి, కాదు ముఖ సౌందర్యాన్ని ఇమనుడింప చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సబ్జా గింజలు ఆరోగ్య పరంగానూ, ముఖ సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం!. ఆరోగ్యపరంగా.. మధుమేహన్ని నియంత్రిస్తాయి. ప్రతీరోజు రెండు స్పూన్ల సబ్జాగింజలు తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తినాలన్న కోరికను నియంత్రిస్తుంది భోజనానికి ముందు సబ్జా గింజలను పెరుగులో కలిపి, కొన్ని కూరగాయ ముక్కలను జోడించి తీసుకుంటే మనకు తెలియకుండానే తక్కువగా ఆహారం తీసుకుంటాం. నానాబెట్టిన సబ్జాగింజలను నానబెట్టి తీసుకుంటే అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఏదోరకంగా సబ్జాగింజలను తీసుకుంటుంటే కడుపు మంటను నియంత్రించడమే గాక శరీరంలోని కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మారకుండా నియంత్రిస్తుంది సబ్జాతో మరింత కాంతిమంతం సబ్జాగింజలను నీటిలో నానబెట్టి , పేస్టు చేయాలి. ఈ పేస్టులో టీస్పూను బాదం నూనె వేసి కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా రాయాలి. పదినిమిషాలు ఆరాక మరోసారి పూత వేయాలి. పూర్తిగా ఆరాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. దీంతో మీ ముఖం కాంతిమంతంగా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది. పంటికి జామ నాలుగు జామ ఆకులని నీటిలో వేసి మరిగించాలి. మరిగిన నీటిని వడగట్టి..గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా పుక్కిలించడం వల్ల పంటినొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. జామ ఆకుల రసం పళ్లను మరింత దృఢంగా మారుస్తుంది. (చదవండి: రాత్రిళ్లు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా? బీ కేర్‌ఫుల్ అంటున్న వైద్యులు!) -
పిడుగుపాటుకు ఒకే రోజు 9 మంది మృతి!
భోపాల్: పిడుగులు పడి మధ్యప్రదేశ్‌లో ఒకే రోజు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. విదిశా, సట్నా, గుణా జిల్లాల్లో పిడుగులు పడి ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సైతం భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. చెట్టుకింద నిలుచోవటమే శాపంగా మారింది.. విదిశా జిల్లాలోని అగసోడ్ గ్రామంలో శనివారం సాయంత్రం వర్షం వస్తుందని నలుగురు ఓ చెట్టుకింద తలదాచుకున్నారు. అయితే.. అదే చెట్టుపై పిడుగు పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోనే జరిగినట్లు సిటీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కున్వర్ సింగ్ ముకటి తెలిపారు. మృతులు గాలు మాలవియా, రాము, గుడ్డా, ప్రభు లాల్‌గా గుర్తించారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సింగ్ తెలిపారు. సట్నా జిల్లాలోని పోడి పతౌరా, జట్వారా ప్రాంతాల్లో శనివారం సాయంత్రం పిడుగులు పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు అంజన, చంద్రా, రాజ్‌కుమార్, రామ్‌కుమార్ యాదవ్‌గా గుర్తించారు. గుణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇదీ చదవండి: కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్లు.. కసాయి తల్లిపై విచారణ -
యూపీలో పిడుగుల వర్షం.. ఒకే రోజు 14 మంది మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం పిడుగుల వర్షం కురిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. సహాయ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. బండా జిల్లాలో పడిన పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. ఫతేపూర్‌లో ఇద్దరు, బలరామ్‌పుర్, చందౌలీ, బలుందర్‌శహర్, రాయ్‌బరేలీ, అమేఠీ, కౌశాంబీ, సుల్తాన్‌పుర్, చిత్రకూట్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. పిడుగుల ఘటనలపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందించాలని సూచించినట్లు చెప్పారు కమిషనర్. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఇదీ చదవండి: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు -
పిడుగును ఫోన్లో బంధించబోయి..
చెన్నై : మొబైల్లో పిడుగు ఫొటోను తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో బుధవారం చోటు చేసుకుంది. వర్షం కురుస్తున్న సమయంలో స్నేహితుడి రొయ్యల ఫాంకు వెళ్లిన రమేష్(43) పిడుగుపాటును ఫోన్లో చిత్రీకరించేందుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే, పిడుగు అతనికి మరింత చేరువలో పడటంతో ఆ ధాటికి రమేష్ ప్రాణాలు వదిలినట్లు చెప్పారు. ఫాం వద్ద పడివున్న రమేష్‌ను అతని స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారని తెలిపారు. రమేష్ ముఖం, ఛాతి భాగాల్లో తీవ్రంగా గాయాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారని వివరించారు. కాగా, పిడుగుపాటు సమయంలో ఫోన్ కెమెరాలతో ఫొటోలు తీసేందుకు యత్నించొద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. -
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
దొనకొండ(ప్రకాశం జిల్లా): దొనకొండ మండలం ఎర్రబాలెంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పులి సుబ్బారెడ్డి(65), మోది గురవయ్య(65), మోది లక్ష్మి(60)లు వంగతోటలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా పిడుగుపడింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పిడుగుపాటుకు 32 మంది మృత్యువాత
పట్నా(బీహార్): బీహార్ రాష్ట్రం పిడుగులతో అతలాకుతలమైంది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. రాజధాని పట్నాతోపాటు రోహ్తాస్, వైశాలి, భోజ్‌పూర్, నలందా, బక్సార్ తదితర జిల్లాల్లో పిడుగులు పడి 32 మంది చనిపోయారు. రోహ్తాస్, వైశాలి జిల్లాల్లో అత్యధికంగా పది మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉరుములు, పిడుగులపై ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి హెచ్చరికలు జారీ చేసేందుకు జాతీయ వాతావరణ విపత్తు సంస్థ రూపొందించిన ప్రత్యేకంగా యాప్ ఉందని, ఏపీలో మాదిరిగానే దానిని త్వరలోనే వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. -
పిడుగులతో అతలాకుతలం: 16 మంది మృతి
-
పిడుగులతో అతలాకుతలం: 16 మంది మృతి
పాట్నా: బీహార్ రాష్ట్రాన్ని ఆదివారం పిడుగులు అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 16 మంది మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ మేరకు బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ ఓ ప్రకటన విడుదల చేసింది. వైశాలి జిల్లాలో ఐదుగురు పిడుగుపాటుకు గురయ్యారని తెలిపింది. భోజ్‌పూర్, బుక్సర్, సంస్తిపూర్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. సరన్, అరారియా, పాట్నా, ఔరంగాబాద్ జిల్లాల్లో ఒకరు మరణించారని వెల్లడించింది. మృతుల కుటుంబాలకు నితీశ్ సర్కార్ రూ. 4 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. -
పిడుగు పాటుకు ఇద్దరు మృతి
- పాలమూరు జిల్లాలో వర్ష బీభత్సం సాక్షి నెట్వర్క్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం దేపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలం గౌడ్ (48) వర్షం వస్తుండగా చెట్టుకింద నిల్చున్నాడు. ఒక్కసారిగా అతనికి సమీపంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం గట్టుకాడిపల్లికి చెందిన అల్వాల ఆంజనేయులు (60) పొలంలో నీరు పెడుతుండగా వర్షం రావడంతో మామిడి చెట్టు కిందకు వెళ్లాడు. పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నవాబుపేటమండల పరిధిలోని హజిలాపూర్‌లో బోయిని నారాయణ అనే రైతుకు చెందిన రెండు పాడి గేదెలు పిడుగు పాటుకు మృతి చెందాయి. రుద్రారం గ్రామానికి చెందిన దండు వెంకటయ్య ఎద్దు కూడా పిడుగుపాటుకు చనిపోయింది. బాలానగర్ మండలం పెద్దాయపల్లి పరిధిలోని సేరిగుడ శివారులో పిడుగుపడడంతో చెట్టుకింద తలదాచుకుంటున్న చాకలి బాలమణి, ఈటమోని నర్సింహులు అస్వస్థతకు గురయ్యారు. సీబెల్కొ పరిశ్రమలో పిడుగు పడటంతో అక్కడున్న కార్మికులు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు గండేడ్ మండలం గాధిర్యాల్ గ్రామానికి చెందిన మహిపాల్‌రెడ్డి గేదెలు పొలంలో మేస్తుండగా గాలికి తెగిన తీగలకు తగిలి అక్కడే మృతిచెందింది. రెడ్డిపల్లి గ్రామ శివారులో పిడుగుపాటుకు చాపల తిరుపతయ్యకు చెందిన గేదె మృత్యువాత పడింది. నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరులో విద్యుత్‌తీగలు తెగిపడి ఐదు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. -
పిడుగుపాటుకి ముగ్గురు మృత్యువాత
ఆదిలాబాద్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ముగ్గురు చనిపోయూరు. ప్రమాదవశాత్తు మరొకరు మరణించారు. లక్సెట్టిపేట, నేరడిగొండ, భైంసా, కుభీర్, జైనథ్, చెన్నూర్, బేల, కౌటాల మండలాల్లో వడగండ్ల వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు గ్రామాల్లో పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. మండల కేంద్రమైన కుభీర్‌కు చెందిన రైతు ఠాగూర్ మహేందర్‌సింగ్(36) తన పొలానికి ట్రాక్టర్‌పై డ్రైవర్ పుప్పాల పీరాజీ(35)తో కలిసి వెళ్తుండగా వర్షం కురిసింది. దీంతో మామిడి చెట్టు కిందికి వెళ్లి ఆగారు. అంతలోనే పిడుగుపడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. లక్సెట్టి పేట మండలం దౌడపల్లి గ్రామంలో గొర్రెల కాపరి రబ్బాని రవ(18) పిడుగుపాటుకు మంగళవారం సాయత్రం చనిపోయాడు. -
బీహార్‌లో పిడుగులు పడి 21 మంది మృతి
బీహార్‌లో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన సంఘటనలో మొత్తం 21 మంది మరణించారు. ఔరంగాబాద్ జిల్లాలో ఆరుగురు, బంకాలో ఐదుగురు, జముయ్‌లో ముగ్గురు, సుపాల్‌లో ఇద్దరు, భోజ్‌పూర్, కటిహార్, పాట్నా, గయా, రోహ్టాస్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్టు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం ఈ దుర్ఘటనలు జరిగాయి. ఔరంగాబాద్‌లో నలుగురు పిల్లలు మైదానంలో ఆడుకుంటున్న సమయంలో పిడుగుపడటంతో మరణించారు.