పిడుగుపాటుకు 32 మంది మృత్యువాత | many people died by Lightening in beehar | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు 32 మంది మృత్యువాత

Published Mon, Jul 10 2017 7:20 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

పిడుగుపాటుకు 32 మంది మృత్యువాత - Sakshi

పిడుగుపాటుకు 32 మంది మృత్యువాత

పట్నా(బీహార్‌): బీహార్ రాష్ట్రం పిడుగులతో అతలాకుతలమైంది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. రాజధాని పట్నాతోపాటు రోహ్‌తాస్‌, వైశాలి, భోజ్‌పూర్‌, నలందా, బక్సార్‌ తదితర జిల్లాల్లో పిడుగులు పడి 32 మంది చనిపోయారు. రోహ్‌తాస్‌, వైశాలి జిల్లాల్లో అత్యధికంగా పది మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉరుములు, పిడుగులపై ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి హెచ్చరికలు జారీ చేసేందుకు జాతీయ వాతావరణ విపత్తు సంస్థ రూపొందించిన ప్రత్యేకంగా యాప్‌ ఉందని, ఏపీలో మాదిరిగానే దానిని త్వరలోనే వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement