పిడుగుపాటుకు ముగ్గురి మృతి
Published Tue, Aug 1 2017 7:38 PM | Last Updated on Mon, Sep 11 2017 11:01 PM
దొనకొండ(ప్రకాశం జిల్లా): దొనకొండ మండలం ఎర్రబాలెంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పులి సుబ్బారెడ్డి(65), మోది గురవయ్య(65), మోది లక్ష్మి(60)లు వంగతోటలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా పిడుగుపడింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement