పిడుగులతో అతలాకుతలం: 16 మంది మృతి | Lightening kills 16 in bihar | Sakshi
Sakshi News home page

పిడుగులతో అతలాకుతలం: 16 మంది మృతి

Published Sun, Jul 9 2017 10:08 PM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

పిడుగులతో అతలాకుతలం: 16 మంది మృతి

పిడుగులతో అతలాకుతలం: 16 మంది మృతి

పాట్నా: బీహార్‌ రాష్ట్రాన్ని ఆదివారం పిడుగులు అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 16 మంది మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ మేరకు బీహార్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ ఓ ప్రకటన విడుదల చేసింది.

వైశాలి జిల్లాలో ఐదుగురు పిడుగుపాటుకు గురయ్యారని తెలిపింది. భోజ్‌పూర్‌, బుక్సర్‌, సంస్తిపూర్‌లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. సరన్‌, అరారియా, పాట్నా, ఔరంగాబాద్‌ జిల్లాల్లో ఒకరు మరణించారని వెల్లడించింది. మృతుల కుటుంబాలకు నితీశ్ సర్కార్ రూ. 4 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement