సాక్షి, హైదరాబాద్: మద్యం సిండికేట్ల వ్యవహారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చెరో అధికారిని ప్రాసిక్యూషన్‌కు అనుమతినివ్వాల్సి ఉందని అవినీతి నిరోధక శాఖ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం కోరిందని, వాటిని అందించామని ఆయన తెలిపారు.
ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తరువాత పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని, అందుకు గడువునివ్వాలని ఆయన కోర్టును కోరారు. అంగీకరించిన ధర్మాసనం, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం సిండికేట్ల వ్యవహారంతో సంబంధమున్న ప్రతీ వ్యక్తినీ వారి హోదాలకు అతీతంగా విచారించేలా ఆదేశాలివ్వాలంటూ హైదరాబాద్‌కు చెందిన దేబరా, మద్యం సిండికేట్లకు సంబంధించి ప్రభుత్వ నివేదికను బహిర్గతం చేసేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన సీజే నేతత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.
మద్యం సిండికేట్ల కేసు విచారణ వాయిదా
Published Tue, Nov 11 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement
Advertisement