నిల్చున్న చోటే నిగ్గు తేల్చేస్తారు | Live scanners in police stations | Sakshi
Sakshi News home page

నిల్చున్న చోటే నిగ్గు తేల్చేస్తారు

Published Fri, Mar 10 2017 2:04 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

నిల్చున్న చోటే నిగ్గు తేల్చేస్తారు

నిల్చున్న చోటే నిగ్గు తేల్చేస్తారు

సిటీలో లైవ్‌ స్కానర్లు...!
ఘటనా స్థలంలోనే నేరాలను గుర్తించేందుకు అవకాశం
నేరస్తులతో పాటు అనుమానితుల వేలిముద్రల గుర్తింపు
రూ.20 కోట్లు వెచ్చించి ఉపకరణాల ఖరీదుకు సన్నాహాలు
రెండు నెలల్లో ప్రతి ఠాణాకు ఒకటి చొప్పున అందుబాటులోకి..


బోయిన్‌పల్లి ఠాణా పరిధిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరు కుని అక్కడ వేలిముద్రల్ని సేకరిస్తారు. వీటిని నగర, రాష్ట్ర పరిధిలో ఉన్న ఫింగర్‌ప్రింట్‌ బ్యూ రోలకు పంపి ఎవరివనేది గుర్తించడానికి సమ యం పడుతుంది. ఈలోపు నేరగాడు సురక్షిత స్థలానికి చేరుకునే అవకాశం ఉంటుంది.

ఫలక్‌నుమా పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వస్తున్నారు. మతిస్థిమితం లేని ఓ అమాయ కుడు వీరికి తారసపడ్డాడు. అతడి మాటతీరు, వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన పోలీ సులు స్టేషన్‌కు తీసుకువెళ్లి, పూర్వాపరాలు పరి శీలించి అమాయకుడే అని తేల్చారు. ఈలోపు సదరు వ్యక్తి ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా అందుబాటులోకి రానున్నవే లైవ్‌ స్కానర్లు. డిజిటలైజ్డ్‌గా ఉన్న పాత నేరగాళ్ల వేలిముద్రల్ని.. ఘటనాస్థలిలో లభించిన, అనుమానితుల వాటితో పోల్చి క్షణాల్లో ఫలితాలు ఇవ్వడం వీటి ప్రత్యేకత. పాపినాన్‌ సంస్థ చేపట్టిన ఈ ప్రాజక్టు విలువ రూ.20 కోట్ల పైమాటే.    

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో జరుగుతున్న సొత్తు సంబంధిత నేరాల్లో పాత నేరగాళ్లు చేస్తున్నవే ఎక్కువ. ఈ నేపథ్యంలోనే పోలీసులు చోరీ, దోపిడీ, బందిపోటు దొంగతనంతో పాటు సొత్తు కోసం హత్య తదితర కేసుల్లోనూ ఘటనాస్థలి నుంచి వేలిముద్రల్ని సేకరిస్తుంటారు. వీటిని అప్పటికే పోలీసు రికార్డుల్లో ఉన్న పాత నేరగాళ్ల వేలిముద్రలతో పోల్చి బాధ్యుల్ని గుర్తిస్తుంటారు. అయితే ఇది చాలా సమయం వెచ్చించాల్సిన వ్యవహారం. ఇలా ఏటా పాత నేరగాళ్లు ఎక్కువగా దొరుకుతుండడం, తనిఖీల నేపథ్యంలో అనుమానితుల్ని గుర్తించడం కష్టంగా మారింది.

అన్నీ డిజిటలైజ్‌ చేస్తూ..
రాష్ట్ర పరిధిలో స్టేట్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎస్సీఆర్బీ), నగర పరిధిలో సిటీ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(సీసీఆర్బీ) ఉంటాయి. వీటి పరిధుల్లోని వేలిముద్రల విభాగాల్లో నేరగాళ్ల ఫింగర్‌ప్రింట్స్‌ను భద్రపరుస్తుం టారు. ఏదైనా కేసులో ఓ నిందితుడిని పట్టుకున్న వెంటనే అతడి పూర్తి వివరాలతో పాటు ఫొటో, వేలిముద్రల్ని సేకరించి ఉంచు తారు. ఇలా ఉన్న దాదాపు 3 లక్షల వేలి ముద్రల్ని తాజా ప్రాజెక్టులో భాగంగా డిజిట లైజ్‌ చేస్తూ ఓ సర్వర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. లైవ్‌ స్కానర్లుగా పిలిచే చేతిలో ఇమిడిపోయే యంత్రాలు ఖరీదు చేస్తున్నారు. ఇవి నిత్యం వేలిముద్రల డేటాబేస్‌తో అనుసంధానించి ఉంటాయి.

క్షేత్రస్థాయిలోనే ఫలితాలు..
పోలీసులు ఘటనాస్థలికి వెళ్లేప్పుడు లైవ్‌ స్కానర్లను తీసుకెళ్తారు. క్రైమ్‌ సీన్‌ నుంచి వేలిముద్రల్ని సేకరించే క్లూస్‌ నిపుణులు వాటిని లైవ్‌ స్కానర్‌ ద్వారా పరీక్షించి అప్పటికే డేటాబేస్‌లో ఆ వేలిముద్రలు ఉంటే క్షణాల్లో గుర్తిస్తారు. అలానే తనిఖీలు చేసేప్పుడు అనుమానితులు తారసపడితే వారి వేలిని స్కానర్‌లో ఉంచడం ద్వారా పాత నేరస్తుడైతే వెంటనే గుర్తించే ఆస్కారం ఏర్పడుతుంది.

ఆధార్‌ లింకేజ్‌కీ సన్నాహాలు..
అనుమానిత వేలిముద్రలు పాత నేరగాళ్లవి కాకపోతే సర్వర్‌ గుర్తించడం సాధ్యంకాదు. అయితే కొన్ని నేరాలు కొత్త నేరగాళ్లు చేసే ఆస్కారం ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసు విభాగం లైవ్‌స్కానర్లకు ఆధార్‌ లింకేజ్‌ కోసం సన్నాహాలు చేస్తోంది. అలా చేస్తే పాత నేరగాళ్ల డేటాబేస్‌లో వేలిముద్రలు లేకపోయినా నిందితుల్ని తక్షణం గుర్తించవచ్చు. ఏప్రిల్‌ చివరి నాటికి ప్రతి పోలీసుస్టేషన్‌కు ఓ లైవ్‌స్కానర్‌ అందించేందుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement