సాక్షి, మహబూబ్‌నగర్: సాధారణ ఎన్నికల్లో జిల్లాలో కాం గ్రెస్ పార్టీకి ఆశించినస్థాయిలో ఫలితాలు దక్కలేదు. తెలంగాణ ఇచ్చాం.. తెచ్చామని ప్రచారం చేసినప్పటికీ ప్రజాదరణ ను పొందలేకపోయింది.
ఈ నేపథ్యం లోనే ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన ప రిస్థితి ఏర్పడింది. ఎన్నికల ఫలితాలపై రాష్ట్రస్థాయి, జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్న టీపీసీసీ.. శానససభ పక్ష నాయకుడి ఎంపిక పె దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఆ పదవిపై జిల్లాకు చెందిన మా జీమంత్రి డీకే అరుణ, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి ఆశిస్తున్న ట్లు అ నుచరవర్గాల్లో చ ర్చ సాగుతోంది. ఈ ఇద్దరు నేతలకు రాష్ట్ర మంత్రివర్గంలో వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన అ నుభవం ఉం ది. డీకే అరుణ గద్వాల నియోజకవర్గం నుంచి అ సెం బ్లీకి మూడు ప ర్యాయాలు ఎన్నికై హ్యాట్రిక్‌ను సాధించిన నేతగా గు ర్తింపును తెచ్చుకున్నారు. జి.చిన్నారెడ్డి కూడా రెండు పర్యాయా లు అసెంబ్లీకి ఎన్నికై మం త్రిగా పనిచేశారు. ఈయన కూడా జాతీయ, రాష్ట్రస్థాయి పా ర్టీలో గుర్తిం పు పొందారు.
ఈ ఎన్నికల్లో పలు జి ల్లాల్లో ముఖ్యనేతలంతా ఓటమిపాలు కావడంతో సీఎల్పీ పదవిపై జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలు కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే మహిళ నేతను ము ఖ్యమంత్రిగా చేస్తామని యువనేత రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించిన నేపథ్యంలో మాజీమంత్రి డీకే అరుణకు సీఎల్పీ పదవి దక్కవచ్చన్న చర్చ ఊపందుకుంది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత పొన్నాల లక్ష్మయ్య టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నందున సీఎల్పీ పదవిని మరో సామాజికవర్గానికి కట్టబెడతారన్న సమీకరణాల నేపథ్యంలో చిన్నారెడ్డి ఈ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు తె లిసింది.
చిన్ని చిన్ని ఆశ!
Published Mon, May 19 2014 2:48 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement