G.china reddy
-
జిల్లాల ఏర్పాటును వేగవంతం చేయాలి
ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి వనపర్తిరూరల్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి న విధంగా మహబూబ్‌నగర్‌ను మూడు జిల్లాలుగా విభజించాలని ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి కోరారు. బుధవారం స్థానిక పీఆర్ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తు తం ఉన్న తెలంగాణ పది జిల్లాలను 24 జిల్లాలుగా మార్చాలన్నా రు. మహబూబ్‌నగర్‌లో రెండో అతిపెద్ద పట్టణంగా అభివృద్ధి చెందుతున్న వనపర్తిని జిల్లా కేం ద్రంగా అప్‌గ్రేడ్ చేసి ఎన్నికల సం దర్భంగా సీఎం కేసీఆర్ వనపర్తి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. నియోజకవర్గా ల పునర్విభజన తర్వాత జిల్లాల ఏర్పాటు చేస్తామని సీఎం ఇది వరకే చెప్పటం జరిగిందన్నారు. కానీ 2026వరకు నియోజకవర్గాల పునర్విభజన చేయటం సా ద్యం కాదని, పార్లమెంటు సమావేశంలో సంబంధిత కేంద్రమంత్రి లిఖిత పూర్వక లేఖ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ని యోజకవర్గాల పునర్విభజనకు సంబం ధం లేకుండా జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తాగునీటి కోసం రూ.2.5కోట్లు వేసవిలో మంచినీటి సమస్యలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటానికి ప్రభుత్వం ఒక్కొ నియోజకవర్గానికి రూ.2.50 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పా రు. ప్రస్తుతానికి కలెక్టర్ రూ.2 కోట్ల నిధులకు ప్రొసిడింగ్ ఇచ్చారని, వనపర్తి నియోజజకవర్గం లోని ఐదు మండలాల్లో ఒక్కో మండలానికి రూ.40లక్షల చొప్పు న గ్రామాల్లో తాగునీటి కోసం నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలి పారు. సమావేశంలో మాజీ మా ర్కెట్ చైర్మన్ బి. శ్రీని వాస్‌గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్, పసుపుల తిరుపతయ్య, మాజీ కౌన్సిలర్ నందిమల్లశ్యాంకుమార్, నాయకులు శివసేనారెడ్డి, బ్రహ్మం ఆచారి పాల్గొన్నారు. -
అధికారపక్షం బాధ్యతతో మెలగాలి
‘సాక్షి’తో ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఎదురుదాడి సరికాదు.. జగదీశ్‌రెడ్డి భాషతో మనస్తాపం కలిగింది పద్దులపై చర్చలు సంతృప్తికరం సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చ జరిగే విధంగా బాధ్యత వహించాల్సింది అధికారపక్షమేనని కాంగ్రెస్ శాసనసభ్యులు జి.చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడిన అనంతరం గురువారం ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు దూకుడుగా, వ్యూహాత్మకంగా వ్యవహరించడం సహజమన్నారు. అధికారపక్షం బాధ్యతాయుతంగా, సహనంతో సభను జరపాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారపక్షమే ఎదురుదాడికి దిగడం సరైంది కాదని చెప్పారు. ‘మంత్రి జగదీశ్ రెడ్డి సభలో వ్యవహరించిన తీరు బాగాలేదు. ఆయన వాడిన పదజాలం, భాష తీరు నాకు తీవ్ర మనస్తాపాన్ని కలి గించింది. జగదీశ్‌రెడ్డిని ఉద్యమంలో పాల్గొనలేదని నా అభిప్రాయం కాదు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ రాజకీయాల్లో కొనసాగుతున్నాను’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం తాను చేసిన కృషి గురించి తెలియకుండా మంత్రి జగదీశ్ మాట్లాడటం సరికాదన్నారు. 2004లో మంత్రి పదవిని ఇవ్వాలని స్వయంగా సోనియాగాంధీ సూచించినా.. మూడేళ్ల తర్వాత పదవి వచ్చిందని, దీనికి కారణం ఏమిటో సీఎం కేసీఆర్‌కు తెలుసన్నారు. గత అసెంబ్లీ సమావేశాలతో పోలిస్తే కాంగ్రెస్ పనితీరు చాలా వరకు మెరుగుపడిందన్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్ అయ్యామన్నారు. కాంగ్రెస్‌లో మరింత సమన్వయం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పద్దులపై ఈ బడ్జెట్ భేటీల్లో చర్చ జరిగిన తీరు బాగుందన్నారు. ఆచరణ సాధ్యం కాని బడ్జెట్ ఇదీ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ఆచరణ సాధ్యంకాని, మేడిపండు బడ్జెట్ అని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. గత ఏడాది లక్షకోట్ల బడ్జెట్లో ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్లో కేవలం 65 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. దీనివల్ల సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులేవీ ఖర్చుచేయలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 750 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 79 మంది మాత్రమే అని అబద్దాలను చెబుతున్నదని చిన్నారెడ్డి విమర్శించారు. తెలంగాణ కోసం 1200 మంది అమరులైనారని స్వయంగా చెప్పినా కేసీఆర్.. ఎక్స్‌గ్రేషియాను మాత్రం 530 మందికే ఇచ్చారని అన్నారు. కేజీ టు పీజీ విద్య విషయంలోనూ ఇచ్చిన హామీని అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. రైతాంగానికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా కొత్త ప్రాజెక్టుల పేర్లు చెప్పి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కరెంటు విషయంలోనూ ఆచరణ సాధ్యంకాని మాటలతోనే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హామీలను అమలు చేయకుండా కేవలం కాగితాల మీదనే కేటాయింపులు చేసి ఖర్చుచేయకుండా మోసం చేసే ప్రయత్నమని చిన్నారెడ్డి విమర్శించారు. -
చిన్ని చిన్ని ఆశ!
సాక్షి, మహబూబ్‌నగర్: సాధారణ ఎన్నికల్లో జిల్లాలో కాం గ్రెస్ పార్టీకి ఆశించినస్థాయిలో ఫలితాలు దక్కలేదు. తెలంగాణ ఇచ్చాం.. తెచ్చామని ప్రచారం చేసినప్పటికీ ప్రజాదరణ ను పొందలేకపోయింది. ఈ నేపథ్యం లోనే ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన ప రిస్థితి ఏర్పడింది. ఎన్నికల ఫలితాలపై రాష్ట్రస్థాయి, జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్న టీపీసీసీ.. శానససభ పక్ష నాయకుడి ఎంపిక పె దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఆ పదవిపై జిల్లాకు చెందిన మా జీమంత్రి డీకే అరుణ, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి ఆశిస్తున్న ట్లు అ నుచరవర్గాల్లో చ ర్చ సాగుతోంది. ఈ ఇద్దరు నేతలకు రాష్ట్ర మంత్రివర్గంలో వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన అ నుభవం ఉం ది. డీకే అరుణ గద్వాల నియోజకవర్గం నుంచి అ సెం బ్లీకి మూడు ప ర్యాయాలు ఎన్నికై హ్యాట్రిక్‌ను సాధించిన నేతగా గు ర్తింపును తెచ్చుకున్నారు. జి.చిన్నారెడ్డి కూడా రెండు పర్యాయా లు అసెంబ్లీకి ఎన్నికై మం త్రిగా పనిచేశారు. ఈయన కూడా జాతీయ, రాష్ట్రస్థాయి పా ర్టీలో గుర్తిం పు పొందారు. ఈ ఎన్నికల్లో పలు జి ల్లాల్లో ముఖ్యనేతలంతా ఓటమిపాలు కావడంతో సీఎల్పీ పదవిపై జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలు కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే మహిళ నేతను ము ఖ్యమంత్రిగా చేస్తామని యువనేత రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించిన నేపథ్యంలో మాజీమంత్రి డీకే అరుణకు సీఎల్పీ పదవి దక్కవచ్చన్న చర్చ ఊపందుకుంది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత పొన్నాల లక్ష్మయ్య టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నందున సీఎల్పీ పదవిని మరో సామాజికవర్గానికి కట్టబెడతారన్న సమీకరణాల నేపథ్యంలో చిన్నారెడ్డి ఈ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు తె లిసింది.