ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి
వనపర్తిరూరల్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి న విధంగా మహబూబ్‌నగర్‌ను మూడు జిల్లాలుగా విభజించాలని ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి కోరారు. బుధవారం స్థానిక పీఆర్ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తు తం ఉన్న తెలంగాణ పది జిల్లాలను 24 జిల్లాలుగా మార్చాలన్నా రు. మహబూబ్‌నగర్‌లో రెండో అతిపెద్ద పట్టణంగా అభివృద్ధి చెందుతున్న వనపర్తిని జిల్లా కేం ద్రంగా అప్‌గ్రేడ్ చేసి ఎన్నికల సం దర్భంగా సీఎం కేసీఆర్ వనపర్తి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.
నియోజకవర్గా ల పునర్విభజన తర్వాత జిల్లాల ఏర్పాటు చేస్తామని సీఎం ఇది వరకే చెప్పటం జరిగిందన్నారు. కానీ 2026వరకు నియోజకవర్గాల పునర్విభజన చేయటం సా ద్యం కాదని, పార్లమెంటు సమావేశంలో సంబంధిత కేంద్రమంత్రి లిఖిత పూర్వక లేఖ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ని యోజకవర్గాల పునర్విభజనకు సంబం ధం లేకుండా జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
తాగునీటి కోసం రూ.2.5కోట్లు
వేసవిలో మంచినీటి సమస్యలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటానికి ప్రభుత్వం ఒక్కొ నియోజకవర్గానికి రూ.2.50 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పా రు. ప్రస్తుతానికి కలెక్టర్ రూ.2 కోట్ల నిధులకు ప్రొసిడింగ్ ఇచ్చారని, వనపర్తి నియోజజకవర్గం లోని ఐదు మండలాల్లో ఒక్కో మండలానికి రూ.40లక్షల చొప్పు న గ్రామాల్లో తాగునీటి కోసం నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలి పారు. సమావేశంలో మాజీ మా ర్కెట్ చైర్మన్ బి. శ్రీని వాస్‌గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్, పసుపుల తిరుపతయ్య, మాజీ కౌన్సిలర్ నందిమల్లశ్యాంకుమార్, నాయకులు శివసేనారెడ్డి, బ్రహ్మం ఆచారి పాల్గొన్నారు.
జిల్లాల ఏర్పాటును వేగవంతం చేయాలి
Published Thu, Apr 23 2015 1:34 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement