
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులు వేస్తున్న ఎన్నికల సంఘం పోలీసుశాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో అవసరమైన భద్రత ప్రణాళిక (సెక్యూరిటీ ప్లాన్ ) సిద్ధం చేయాలని నిజామాబాద్ సీపీతో పాటు, కామారెడ్డి ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుంచి ఆదేశాలందా యి. పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు, ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కు ను వినియోగించుకునేందుకు అవసరమైన భద్రత సిబ్బంది, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, వాటి వద్ద ప్రత్యేక నిఘా వం టి వివరాలను పంపాలని ఆదేశాల్లో పేర్కొంది.
జిల్లాలో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలేమైనా ఉన్నాయా? ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏమైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయా? అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలేమిటీ? వివరాలతో నివేదికలు తయారు చేయాల ని పోలీసుశాఖను ఆదేశించింది. రెండు జిల్లాల కలెక్టర్ల ద్వారా నిజామాబాద్ సీపీ, కామారెడ్డి ఎస్పీలకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసుశాఖ విజయవంతమైంది. పార్లమెంట్ ఎన్నికలను కూడా ఇదే తరహాలో జరపాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ఏసీపీ, డీఎస్పీలు పార్లమెంట్ సెక్యూరిటీ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు. వారి పరిధిలోని పోలీస్‌స్టేషన్ల వారీగా వివరాలను క్రోడీకరిస్తున్నారు.
అసెంబ్లీకి 16 కంపెనీలు
పార్లమెంట్ ఎన్నికల బందోబస్తు కోసం ప్రస్తుతం భద్రత సిబ్బంది ఎంత మంది ఉన్నారు.. కేంద్ర బలగాలు ఏ మేరకు అవసరం ఉంటుంది.. వం టి వివరాలను పంపాలని ఎన్నికల సంఘం ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా కు పది కంపెనీలకు చెందిన సుమారు వెయ్యి మంది, కామారెడ్డి పరిధిలో ఆరు కంపెనీలకు చెందిన సుమారు 600 మంది కేంద్ర బల గాలను మోహరించారు. పారామిలటరీ బలగాలు జిల్లాకు వచ్చాయి. ఇవి కాకుండా ఒక్క నిజా మాబాద్ జిల్లాలోనే సుమారు 2,100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల బందోబస్తు విధులు నిర్వర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు నిజామాబాద్ పరిధిలో 348 ఉండగా, కామారెడ్డి పరిధిలో 188 ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ పోలింగ్ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక నిఘా పెట్టిన విషయం విదితమే..
బదిలీలపైనా కసరత్తు..
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుశాఖ బదిలీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల నిబంధనల మేరకు నాలుగేళ్లలో మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఒకే ప్రాంతంలో పనిచేసిన వారిని బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లాలో ఏయే అధికారికి బదిలీ అయ్యే అవకాశాలున్నాయనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైన విషయం విదితమే. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన పోలిం గ్ కేంద్రాల కంటే అదనంగా ఏమైనా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అవసరమా ? తొలగించాల్సి న పోలింగ్ కేంద్రాలు ఏమైనా ఉన్నాయా? వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఎన్నికల సంఘానికి రేషనలైజేషన్‌పై పూర్తి స్థాయిలో నివేదికలు పంపినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment