'గద్వాల్‌ను ప్రత్యేక జిల్లా చేయాలి' | Mahabubnagar leaders meets CM Kcr | Sakshi
Sakshi News home page

'గద్వాల్‌ను ప్రత్యేక జిల్లా చేయాలి'

Published Mon, Jul 21 2014 7:40 PM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM

'గద్వాల్‌ను ప్రత్యేక జిల్లా చేయాలి' - Sakshi

'గద్వాల్‌ను ప్రత్యేక జిల్లా చేయాలి'

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఆధ్వర్యంలో మహమబూబ్‌నగర్ జిల్లా నేతలు సీఎం కేసీఆర్‌ను కలిశారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాతే పాకాల, జూరాల ప్రాజెక్ట్ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే ప్రతిపాదిత థర్మల్ పవర్ స్టేషన్‌ను నెలకొల్పాలని కోరారు. గద్వాల్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కాగా డీకే అరుణ... కేసీఆర్ ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. శాసనసభ తొలి ప్రతిపక్ష నేతగా కుందూరు జానారెడ్డి, శాసనమండలిలో తొలి ప్రతిపక్ష నేతగా ధర్మపురి శ్రీనివాస్ నియామకంపై డీకే అరుణ వర్గం అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement