జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలు | Mahadevpur captured seven Robbers | Sakshi
Sakshi News home page

జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలు

Published Thu, Apr 7 2016 2:12 AM | Last Updated on Sun, Sep 2 2018 3:57 PM

జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలు - Sakshi

జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలు

మహదేవపూర్‌లో చిక్కిన ఏడుగురు దొంగలు
మరోముగ్గురు పరారీలో..?
18 బైకులు స్వాధీనం

 
 
కాళేశ్వరం: విద్యాబుద్ధులు నేర్చుకుని తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండాల్సిన యువకులు జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలకు పాల్పడుతూ అడ్డం గా దొరికిపోయూరు. మహదేవపూర్ మండల కేంద్రంలో ఏడుగురు బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు దొంగిలించిన 18 బైక్‌లను స్వాధీ నం చేసుకున్నారు. గోదావరిఖని ఏ ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ వెల్లడించిన వివరాల ప్రకారం... మహదేవపూర్‌లో ఎస్సై వై.కృష్ణారెడ్డి పోలీసు సిబ్బందితో బుధవారం వాహనాల తనిఖీ చేపట్టారు. రెండు బైకులపై ఐదుగురు యువకులు కాళేశ్వరం నుంచి మహదేవపూర్‌కు వెళ్తున్నారు. వారిపై అనుమా నం వచ్చి విచారించారు. వాహనాల ధ్రువీకరణ పత్రాలు చూపకపోవడంతో ఎలాంటి సమాధానాలు తెలపలేదు.

దీంతో అదుపులోకి తీసుకున్న పోలీసు లు విచారించగా బైక్‌ల చోరీల గురించి ఒప్పుకున్నారు.  వీరంతా జల్సాలకు అలవాటు పడుతూ బైకులు దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. వీరిలో ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్‌కు చెందిన బడికెల రాజేష్(25), మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన పానిగంటి తిరుపతి(21), వెంకటేష్(20), పంచిక రజినీకాంత్(19), కొడిపెల్లి రక్షత్(19)మేజర్లు కాగా.. అడవి శ్రీరాంపూర్ మండలం ముత్తారం గ్రామానికి చెందిన రత్న అజయ్(17)మల్హర్ మండలం పెద్దతూండ్ల గ్రామానినికి చెందిన ఖమ్మంపల్లి గణేష్(17) మైనర్లు ఉన్నట్లు ఏఎస్పీ చెప్పారు. వీరందరూ వివిధ ప్రాంతాల్లో ఒక బృందంగా ఏర్పడి మహదేవపూర్, హన్మకొండ, హైదరాబాద్, పరకాల, భూపాలపల్లి, చెన్నూర్ ఏరియాలో బైక్‌లు దొంగిలించినట్లు వివరించారు.

18 బైకులు స్వాధీనం చేసుకుని వారిని మంథని జేఎంఎఫ్‌సీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. మరో ముగ్గురు దొంగలు పరారీలో ఉన్నట్లు తెలిసింది. విలేకరుల సమావేశంలో కాటారం సీఐ గడ్డం సదన్‌కుమార్ ఉన్నారు. బైక్ దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై కృష్ణారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ సుభాష్, పోలీసు సిబ్బంది మధు, గోపాల్, వెంకటేశ్వర్లు, సందీప్, సరేందర్‌ను ఏఎస్పీ అభినందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement