తెరుచుకోనున్న బాబ్లీ గేట్లు
1న గేట్లు ఎత్తనున్న మహారాష్ట్ర
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర నిర్మించి న వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు జూలై 1న తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదే శాల మేరకు గేట్లు మూసిఉంచేందుకు విధిం చిన గడువు ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో అదేరోజు అర్ధరాత్రి 12 గంటలు దాటాక మహారాష్ట్ర నీటిని విడుదల చేయ నుంది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏటా జూలై ఒకటిన ప్రాజెక్టు గేట్లు తెరిచి, అక్టోబర్ 28 వరకు నది సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా మహారాష్ట్ర చూడాలి. అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు గేట్లు మూసి ఉంచాలని సూచించింది. ఈ ఆదేశాల మేరకు అక్టోబర్ 29న 14 గేట్లు మూసేసిన మహారాష్ట్ర వచ్చేనెల 1న తిరిగి తెరవనుంది.
9.68 లక్షల ఎకరాలకు సాగు నీరు...
గతేడాది గోదావరి బేసిన్‌లో కురిసిన వర్షాల వల్ల ఎస్సారెస్పీలోకి భారీ ప్రవాహాలొచ్చా యి. దీంతో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి చేరి.. దీని కింద రబీలో 8.78లక్షల ఎకరాల కు సాగునీరందించారు. ఈ ఏడాది ప్రాజెక్టు పూర్తిస్థాయి ఆయకట్టు 9.68లక్షల ఎకరాలకు నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి బాబ్లీని దాటుకొని వచ్చే ప్రవాహాలే ప్రధానం. ప్రస్తుతం మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో బాబ్లీ గేట్లు తెరుచుకుంటే దిగువకు ప్రవాహాలు పెరిగే అవకాశాలు ఉంటాయని నీటిపారు దల శాఖ అంచనా వేస్తోంది.