పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టింది: భట్టి
Published Mon, Jun 5 2017 4:29 PM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM
ఖమ్మం: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్ధ భ్రష్టుపట్టిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ రాజకీయ రంగు పులుముకుందని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతలు చెప్పిందే పోలీసులు చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హమీలను పూర్తిగా విస్మరించిందన్నారు. టీఆర్ఎస్ పై ప్రజలలో భ్రమలు తొలగిపోతున్నాయి.. ప్రభుత్వంపై త్వరలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మిషన్ భగీరథలో డబ్బులు తప్ప నీళ్లు పారడం లేదని ఎద్దేవా చేశారు. ఈ పథకం కోసం నడుస్తోన్న రక్షిత మంచి నీటి పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు.
Advertisement
Advertisement