
చాంద్రాయణ గుట్టలో వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్ : నగరంలోని చాంద్రాయణ గుట్టలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. స్తానిక మహమ్మద్ నగర్ కు చెందిన రహేమత్ అలీ(40) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబకలహాలతో అలీ తన భార్యకు విడాకులు ఇచ్చి ఒక్కడే మహమ్మద్ నగర్ లో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కాగా ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన అలీ యజమానితో మాట్లడాడు. సోమవారం ఎంతకీ గది తలుపులు తీయకపోవడాన్ని యజమాని గమనించాడు. తలుపులు పగలకొట్టి చూడగా అలీ ఉరివేసుకుని కనిపించాడు. దీంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చాంద్రాయణగుట్ట)