తాగిన మైకంలో కరెంటు స్తంభం ఎక్కి.. | Man dies due to electric shock in Hyderabad | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో కరెంటు స్తంభం ఎక్కి..

Published Mon, Nov 20 2017 10:00 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

Man dies due to electric shock in Hyderabad - Sakshi

హైదరాబాద్‌: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మద్యం మత్తులో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. తీగలు పట్టుకోవడంతో విద్యుదాఘాతంతో కింద పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఆ వ్యక్తి బతికే ఉన్నాడనుకుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement