current poll
-
ఊహించని ప్రమాదం: వరద నీటిలో స్కూటీ స్కిడ్.. కరెంట్ స్తంభం పట్టుకోవడంతో
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో ఐటీ కారిడార్ సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటితో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌తో వాహనాల రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచొట్ల ఊహించని ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. More video from Marathahalli, Bengaluru.#Bangalore #Bengaluru #BengaluruRains #SiliconValleyofIndia #bengalururains #bengalurufloods #Karnataka pic.twitter.com/q5owjkUnhG — Anil Kumar Verma (@AnilKumarVerma_) September 6, 2022 తాజాగా రోడ్డుపై వెళుతోన్న ఓ యువతి ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతువ్యవాత పడింది. ఈ విషాద ఘటన బెంగళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్ సమీపంలో సోమవారం రాత్రి 9.30 నిమిషాలకు చోటుచేసుకుంది. 23 ఏళ్ల అఖిల అనే యువతి పాఠశాలలో ఆడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. విధులు నిర్వహించుకొని రాత్రి స్కూల్ నుంచి తన స్కూటీపై ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలో వరద నీటితో నిండిన రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా స్కూటీ స్కిడ్ అయ్యింది. చదవండి: ఎంత పనైపాయే.. స్కెచ్ ఒకరికి.. మర్డర్ మరొకరిని.. దీంతో యువతి కిందపడకుండా ఉండేందుకు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే అదే స్తంభానికి కరెంట్ పాస్ అవుతుండటంతో షాక్ తగిలి కిందపడిపోయింది. దీనిని గమనించిన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా బెంగళూరులో విద్యుత్ అధికారులు, మున్సిపల్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని.. తన కూతురు చావుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. Situation at Marathahalli, Bengaluru.#Bangalore #Bengaluru #BengaluruRains #SiliconValleyofIndia #bengalururains #bengalurufloods #Karnataka pic.twitter.com/6rftd868Ro — Anil Kumar Verma (@AnilKumarVerma_) September 6, 2022 -
ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం
న్యూఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్ జెట్ విమానం(ఎస్జీ 160) సోమవారం ఉదయం టేకాఫ్ అయ్యే సమయంలో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్యాసింజర్ టెర్మినల్ నుంచి టేకాఫ్ కోసం రన్‌వేపైకి విమానం వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం వెనక్కి తీస్తుండగా కరెంట్ పోల్‌ను విమానం కుడి వైపు ఉన్న వింగ్ బలంగా తాకింది. దీంతో విమానం కుడివైపు రెక్క(రైట్ వింగ్) దెబ్బతింది. అలాగే కరెంట్ స్తంభం కూడా డ్యామేజ్ అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు అవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుంచి జమ్మూకి వెళ్లాల్సి ఉంది. విమానం ప్రమాదానికి గురికావడంతో మరో విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులను జమ్మూకు పంపించారు. మరోవైపు విమానం కరెంట్ పోల్‌ను ఢీకొట్టడంపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. -
బ్లేడ్‌తో చేయి కోసుకుని, తల పగులగొట్టుకొని, కప్పు పెంకులు నమిలి..
సాక్షి, మలక్‌పేట: వైట్నర్ మత్తులో ఓ యువకుడు కరెంట్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. విజయవాడ జాతీయ రహదారిపై దిల్సుఖ్నగర్ సీఎంఆర్ షోరూమ్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. మలక్‌పేట పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సలీంనగర్ ఆఫ్జల్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్ (28) పాతనేరస్తుడు. మలక్‌పేట పీఎస్ పరిధిలో 2016లో చోరీ చేసి జైలుకెళ్లి వచ్చాడు. ఇలా ఉండగా, సోమవారం ఉదయం తనను గుర్తు తెలియని వ్యక్తు కొట్టారంటూ హంగామా చేశాడు. వైట్నర్ మత్తులో ఉన్న అతగాడు బ్లేడ్‌తో చేతులు కోసుకుని, కట్టెతో తల పగులగొట్టుకున్నాడు. చాయ్ కప్పు పెంకులు నమిలాడు. నన్ను ఎందుకు కొట్టారు..ఏం తప్పు చేశానంటూ వీరంగం చేశాడు. అంతటితో ఆగకుండా లోకల్ బస్టాండ్‌పైకి ఎక్కాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలోనే ఇర్ఫాన్ బస్టాండ్ పక్కనే ఉన్న కరెంట్ స్తంభం ఎక్కాడు. అక్కడి నుంచి దూకేస్తానని అరిశాడు. పోలీసులు వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించి సరఫరాను నిలిపివేయించారు. అతడికి నచ్చజెప్పి కరెంట్ స్తంభం మీది నుంచి కిందికి దింపి స్టేషన్‌కు తరలించారు. మానస్థిక స్థితి సరిగా లేదని గ్రహించిన పోలీసులు అతడి కుటుంబసభ్యులను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. -
ఆహారం కోసం వెళ్లి కరెంట్ పోల్స్ మధ్య ఇరుక్కుపోయిన ఎద్దు
-
లిస్ట్‌లో పేరొచ్చినా.. పోస్ట్ రాలే
సాక్షి, సంగారెడ్డి టౌన్: గతేడాది జూలైలో ఐటీఐ ట్రేడ్ పరీక్ష రాసిన విద్యార్థులు అదే ఏడాది అక్టోబర్‌లో వచ్చిన టీఎస్ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. జూలైలో పాసైనట్లు సర్టిఫికెట్లు కలిగి ఉండటంతో ఆన్లైన్లో పేర్కొన్న అన్ని విషయాలను చదివి దరఖాస్తును పూర్తి చేశారు. డిసెంబర్ 15, 2019లో పరీక్ష రాశారు. ఫలితాలు రాగానే ర్యాంకుల ఆధారంగా కరెంట్ పోల్ పరీక్షలోనూ నెగ్గారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఇలా మెరిట్ సాధించి మంచి ర్యాంకులు కలిసిన అభ్యర్థులు తమ ట్రేడ్ సర్టిఫికెట్లో డేట్ అని ఉన్నచోట నవంబర్ 6 అని ముద్రించడంతో అధికారులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో మీ మెమోలు నోటిఫికేషన్ తేదీ తర్వాత ఇష్యూ అయ్యాయంటూ సదరు అభ్యర్థులను ఉద్యోగానికి అనర్హులుగా తేల్చేశారు. చదవండి: ఓఆర్ఆర్.. ఫుల్ జిగేల్! ఇతర పరీక్షలకు భిన్నంగా.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వివిధ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షలన్నింటికీ.. వారు పేర్కొన్న అర్హత కోర్సు నోటిఫికేషన్ వచ్చే నాటికి పాసైతే సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు. టీఎస్ ఎస్పీడీసీఎల్ అధికారులు మాత్రం పరీక్షలో పాసైన నెలను వదిలిపెట్టి.. మెమో తయారు చేసిన తేదీని పరిగణలోకి తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూలైలో ట్రేడ్ కోర్సు పూర్తి చేసుకున్నట్లు సదరు ప్రభుత్వ సంస్థ గుర్తింపు ఇవ్వగా ధ్రువపత్రం తయారీ తేదీని మాత్రమే ఎలా పరిగణలోకి తీసుకుంటామని మండిపడుతున్నారు. న్యాయ పోరాటం చేస్తాం విద్యుత్ శాఖపై మమకాలంతో ఐటీఐ ట్రేడ్ కోర్సు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ గుర్తింపుతో 2019 జూలైలోనే పాసైన అభ్యర్థులు జేఎల్ఎం పరీక్షలో మెరిట్ ర్యాంక్‌లు సాధించినా ఉద్యోగాలివ్వకపోవడం దారుణం. పాసైనా నెల సరి్టఫికెట్లో స్పష్టంగా కనిపిస్తున్నా.. మెమో తయారైన తేదీని ఎలా పరిగణలోకి తీసుకుంటారు. మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చేవరకు న్యాయపోరాటం చేస్తాం. అభ్యర్థులకు మా పూర్తి మద్దతు అందిస్తున్నాం – ప్రభాకర్ గౌడ్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఐఎన్టీయూసీ 327 యూనియన్ జిల్లా అధ్యక్షుడు షాక్ అయ్యాను.. టీఎస్ఎస్పీడీసీఎల్ గతేడాది అక్టోబర్ నెలలో ఇచ్చిన నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకునే నాటికే మేము ఐటీఐ ట్రేడ్ పరీక్ష పాసయ్యాం. సంగారెడ్డి నుంచి నా జిల్లా ర్యాంక్ 468. ఇక్కడ 1000 ర్యాంకు వరకు ఉద్యోగాలొచ్చాయి. కేవలం మెమోపై తేదీ నవంబర్ 6 అని ఉండటం వల్లే ధ్రువపత్రాల పరిశీలన తర్వాత మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అందరిలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఉద్యోగం వస్తుందనుకున్నా.. ఫైనల్ రిజల్ట్‌లో నా పేరు, హాల్ టికెట్ నెంబర్ లేకపోవడం చూసి షాకయ్యా.. – సురేష్ నాయక్, సంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో మెరిట్ ర్యాంక్ వచ్చి పోస్ట్ కోల్పోయిన అభ్యర్థుల వివరాలు జిల్లా అభ్యర్థుల సంఖ్య సిద్దిపేట 12 సంగారెడ్డి 08 మెదక్ 05 మొత్తం 25 -
కరెంటోళ్లతో వేగేదెట్టా?
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే కానీ అధికారులు స్పందించేలా లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు అధికారులపై మండిపడుతున్నారు. హాజీపూర్ మండలం గుడిపేట సబ్‌స్టేషన్ పరిధిలో గల గంగొడ్డు పల్లెకు చెందిన రైతులు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల వర్షాకాలం పంటలు సాగు చేసుకోలేని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా కరెంటు స్తంభాలు సరిచేయాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. ఒరిగిన స్తంభాలతో పొలాల్లో నారు పోసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. తమ గోడు ఎవరికి చెప్పాలో పాలుపోవడం లేదని అంటున్నారు. రైతులంతా బిజీగా ఉంటే తమ పొలంలో ఉన్న విద్యుత్ స్తంభాలు సరి చేయించకపోవడంతో పంట సాగు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 11 కేవీ విద్యుత్‌లైన్ కావడంతో 3 ఫేజ్ విద్యుత్ సరఫరా ఉందని దీంతో పడిపోయిన, ఒరిగి ఉన్న విద్యుత్ పోల్స్ దగ్గరికి వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు అంటున్నారు. గతంలో ఓ వ్యక్తి ఇక్కడ విద్యుత్ షాక్‌తో చనిపోయాడని గుర్తు చేశారు. పట్టించుకునే వారేరీ? కిందపడిపోయి, ఒరిగి ఉన్న స్తంభాలతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. సార్లకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. చెబితే వచ్చి వెళ్లారు. పని మాత్రం చేయలేదు. డబ్బులు ఇవ్వడం లేదని చేయడానికి వస్తలేరు కావచ్చు. సార్లు రాని కారణంగా పంట సాగు చేసుకోలేకపోతున్నాం. నారుపోసుకునే సమయం ఆసన్నమైంది ఏం చేయాలో పాలుపోవడం లేదు. తిరుపతి, ముల్కల్ల -
ఘోర రోడ్డు ప్రమాదం : సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మిరప కోత కూలీలతో వెళుతున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న దుర్ఘటనలో తొమ్మిదిమంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో ఇవాళ సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కూలీ పనులు ముగిసిన అనంతరం కూలీలతో బయల్దేరిన ట్రాక్టర్ అతి వేగంగా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగిపడి ట్రాక్టర్ మీద పడటంతో పాటు, విద్యుత్ వైర్లు కూడా తెగిపడ్డాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్లో డ్రైవర్‌తో కలిపి 23మంది ఉన్నారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాదానికి కారణం అతి వేగంతో పాటు, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. మృతులు మాచవరం ఎస్సీ కాలనీకి చెందినవారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనులకు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో మాచవరం ఎస్సీ కాలనీలో విషాదం నెలకొంది. సీఎం జగన్ దిగ్భ్రాంతి ప్రకాశం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని జిల్లా కలెక్టర్‌కు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించాల్సిందిగా ప్రకాశం జిల్లా మంత్రులను సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
కర్రలే కరెంట్ స్తంభాలు!
సాక్షి, చిన్నంబావి (వనపర్తి): మండలంలోని పలు గ్రామాల్లో కరెంట్ స్తంభాలు లేవు. దీంతో కర్రలనే కరెంట్ స్తంభాలుగా ఉపయోగిస్తూ వ్యవసాయ, డొమెస్టిక్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఫలితంగా విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గాలికి, వానకు కర్రలు కూలిపోతే కరెంట్ సరఫరా ఆగిపోతోంది. పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి.. పెద్దదగడ, వెలగొండ సబ్‌ష్టేషన్ పరిధిలోని గూడెం, బెక్కెం, అమ్మాయిపల్లి, దగడపల్లి, మియాపూర్ తదితర గ్రామాల్లో ఎప్పుడ ఏ ప్రమాదం పొంచి ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చిన్నమారు, గూడెం, పెద్దమారు గ్రామల్లో స్తంభాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ రోజుల్లో కరెంట్ క్షణం పోతేనే నానా హైరానా పడతాం. అలాంటిది ఈ ప్రాంతాల్లోని ప్రజలకు కరెంట్ సమస్య ప్రధానంగా మారింది. వ్యవసాయ పంటపొలాల్లో మరీ పరిస్థితి దారుణంగా ఉంది. వ్యవసాయపు మోటార్ల దగ్గరికి కనెక్షన్ రావాలంటే దాదాపుగా కి.మీ పైనే కర్రలపై విద్యుత్ కనెక్షన్ రైతులు తీసుకుంటున్నారు. ఇక్కడ సరిపడా స్తంభాలు లేక సర్వీస్ వైర్లు అన్ని కర్రలు, ఇనుప స్తంభాలపైనే ఆసరాగా చేసుకుని ప్రజలు, రైతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రమాదమని తెలిసినా ప్రజ లు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. వాటికింది నుం చే రైతులు, ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ట్రాన్స్పార్మర్ల కొరత.. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా సరిపడ స్తంభాలు, ట్రాన్స్పార్మర్లు లేవు. గతంలో ఇక్కడ విద్యుత్ చోరీలు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ స్తంభాలు,ట్రాన్స్పార్మర్లు లేకపోవడంతో స్తానిక ప్రజలు నానా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ స్తంభాలు ఇవ్వాలి.. ఈ కర్రలపై కరెంట్ సర్వీస్ వైర్లు పెట్టుకుని స్తంభాల నుంచి వ్యవసాయ పంటపొల్లాలోకి కరెంట్ తీసుకున్నాం. కరెంట్ బిల్లులు రెగ్యులర్‌గా కడుతున్నాం. ఎప్పుడు కూడా మాకు స్తంభాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడం లేదు. అందుకే మేమే అందరం కలసి కర్రలపైనే కరెంట్ వైర్లు ఏర్పాటు చేసుకున్నాం. స్తంభాలు ఇవ్వాలని కోరుతున్నాం. – బాలస్వామి, చిన్నంబావి పట్టించుకోవడం లేదు కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలని అధికారులకు, నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నా సమస్యకు పరిష్కారం చూపడం లేదు. అధికారులు స్పందించాలి. – రాజు, బెక్కెం -
అధికారుల నిర్లక్ష్యానికి యువతి బలి
కొత్తవలస రూరల్: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యాళ్ల ప్రశాంతి (20) అనే యువతి దుర్మరణం చెందింది. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస – దేవరాపల్లి రహదారిలో దేవాడ– ముసిరాం మధ్య శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. దీంతో ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఆదివారం ఉదయం కొత్త విద్యుత్ స్తంభం వేశారు. విరిగిపోయిన విద్యుత్ స్తంభాన్ని తొలగించలేదు. ఇదిలా ఉంటే విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన యాళ్ల ప్రశాంతి (20) బీటెక్ పూర్తి చేసి గాజువాకలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం దేవరాపల్లి సమీపంలోని వాలాబీ జలపాతం వద్దకు విహారయాత్రకు వచ్చింది. తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై విశాఖ వస్తుండగా, దేవాడ – ముసిరాం వద్ద బస్సును ఓవర్టేక్ చేయబోతూ చీకట్లో రోడ్డుపై పడి ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంతి అక్కడికక్కడే కన్నుమూసింది. విషయం తెలుసుకున్న సీఐ ఆర్.శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రశాంత్‌కుమార్ చేరుకుని విద్యుత్ స్తంభాన్ని పక్కకు తీయించి రాకపోకలు క్రమబద్ధీకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. యాళ్ల ప్రశాంతి స్నేహితులు సంతోష్, మరో ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. -
చిరు ఉపాయం.. తొలగిస్తుంది అపాయం
ముత్తారం: ఎంతటి అపాయాన్ని అయినా చిన్నపాటి ఉపాయంతో తొలగించుకోవచ్చునని, ఉపాయం ఉంటే ఊళ్లు ఏలచ్చని కవులు చెప్పినట్లు..విద్యుత్ స్తంభాలు ఎక్కే క్రమంలో జరిగే అపాయాలను చిరు ఉపాయంతో తప్పిస్తున్నాడు తాత్కాలిక విద్యుత్ హెల్పర్‌గా పనిచేస్తున్న వ్యక్తి. పూర్తి వివరాల్లోకి వెళితే రామగిరి మండలం నాగేపల్లి గ్రామ పంచాయతీ విద్యుత్ హెల్పర్‌గా పనిచేస్తున్న కుమార్ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు నిచ్చెన ఉపయోగించేవాడు. విద్యుత్ స్తంభం పై భాగానికి వెళ్లాలంటే కాళ్లతోనే ఎక్కాల్సిన పరిస్థితి. దీంతో పలుమార్లు జారిపడి ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. ప్రమాదాల నివారణ కోసం దీర్ఘంగా ఆలోచన చేశాడు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం దొడ్డుకు సరిపడా ఇనుప రాడ్లతో క్లిప్స్ తయారు చేయించి, వాటిని చెప్పులకు బిగించాడు. కాళ్లకు చెప్పులు తొడుక్కొని ఇనుప రాడ్లు, క్లిప్పుల మధ్య విద్యుత్ స్తంభం ఉండడం వల్ల జారిపోకుండా ఉండి సునాయసంగా స్తంభాన్ని ఎక్కుస్తున్నాడు. ఉపాయం చిన్నదే అయిన్పటికీ ఎన్నో అపాయాల నుంచి కాపాడుతోందని కుమార్ చెప్తున్నాడు. కుమార్ పనితనాన్ని అందరూ శభాష్ అంటూ అభినందిస్తున్నారు. -
మూడు గంటలు.. ముచ్చెమటలు!
కుషాయిగూడ: కోర్టు తీర్పుతో మానసికంగా కుంగిపోయిన ఓ జీవితఖైదీ హైటెన్షన్ కరెంట్ పోల్ ఎక్కి మూడు గంటల పాటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనపై అక్రమ కేసు బనాయించి, జైలుపాలు చేసిన శంకర్పల్లి ఎస్సై నాగరాజును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సూసైడ్ నోట్ రాసి కరెంటు స్తంభమెక్కాడు. దీంతో అప్రమత్తమైన జైల్ సిబ్బంది ట్రాన్స్ కో అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది సహకారంతో అతడిని సురక్షితంగా కిందకు దించడంతో కథ సుఖాంతమైంది. సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, శేర్గూడానికి చెందిన యండీ ఖాజాపాషా భార్యపై అనుమానంతో 2012లో బానూరు వద్ద ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. కేసును విచారించిన సంగారెడ్డి కోర్టు 2013లో అతడికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అప్పటి నుంచి చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైల్లో సత్పప్రవర్తనతో మెలగడంతో ఖాజాపాషాను 2017లో జైల్ పెట్రోల్‌బంకు విధుల నిర్వహణకు కేటాయించారు. గత డిసెంబర్లో పెరోల్‌పై నెలరోజుల పాటు ఇంటికి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. అయితే ఈ నెల 7న హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షను ఖారారు చేస్తు తీర్పునివ్వడంతో మానసికంగా కుంగిపోయిన ఖాజాపాషా జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో పెట్రోల్‌బంకు ఆవరణలో కరెంటు పోల్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. ఎస్సై నాగరాజును సస్పెండ్ చేయాలి నా భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపై అక్రమంగా కేసు బనాయించి, తన పిల్లలకు దూరం చేసిన అప్పటి శంకర్పల్లి ఎస్సై నాగరాజు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సూసైడ్ నోట్ రాసి కరెంటు పోలెక్కడంతో అప్రమత్తమైన జైల్ సిబ్బంది, కుషాయిగూడ పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అధికారులు అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించగా పై నుంచి మాటలు వినిపించక పోవడంతో మరో ఖైదీని పోల్ పైకి పంపి సెల్‌ఫోన్‌ను అందజేసి పలుమార్లు సంభాషించారు. అతని డిమాండ్లను అంగీకరిస్తూ, సదరు ఎస్సైపై చర్యలు తీసుకుంటామని కుషాయిగూడ ఏసీపీ కృష్ణమూర్తి, జైల్ సూపరింటెండెంట్ భాస్కర్ హామీ ఇచ్చినా అతను కిందకు దిగిరాలేదు. ‘‘బతకాలని అనిపించడం లేదని, నేను చనిపోతాను’’ అంటూ ఫోన్ కట్‌చేశాడు. దాదాపు మూడు గంటల పాటు అధికారులు, సహచర ఖైదీలు ఫోన్లో మాట్లాడుతూ సర్ధిజెప్పే ప్రయత్నం చేసినా అతని నిర్ణయంలో మార్పురాలేదు. దీంతో అధికారులు రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.. అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న చర్లపల్లి ఫైర్ సిబ్బంది తమ వద్ద ఉన్న మ్యాట్లతో ప్రాథమికంగా రక్షణ చర్యలు చేపట్టారు. ఫైర్ ఆఫీసర్ శైఖర్రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడి 54 ఫీట్ల స్కై లిఫ్ట్‌ను రప్పించారు. కిందపడినా ప్రమాదం జరగకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ఫైర్ సిబ్బందితో పాటు డిప్యూటీ జైలర్ శోభన్‌బాబు కూడా లిఫ్ట్‌లో పైకి వెళ్లి అతడికి నచ్చజెప్పి కిందకు తీసుకువచ్చాడు. జైళ్లశాఖ డీఐజీ సైదయ్య, చర్లపల్లి ఫైర్ ఆఫీసర్ శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అధికారుల నమ్మకాన్ని వమ్ముచేసేలా వ్యవహరించిన ఖాజాపాషాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అందుకుగాను కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖాజాపాషాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా తమకు జైలు అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. -
గ్యాస్ ట్యాంకరు బీభత్సం
పరవాడ(పెందుర్తి): గాజువాక–అనకాపల్లి జాతీయ రహదారిలో లంకెలపాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ గ్యాస్ టాంకరు బీభత్సం సృష్టిం చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం పారాదీప్ నుంచి గ్యాస్ ట్యాంకర్ పరవాడ మండలం తాడి గ్రామం సమీప ఐవోసీ బాట్లింగ్ యూనిట్‌కు వస్తుంది. తెల్లవారుజామున 3 గంటలకు లంకెలపాలెం కూడలి సమీపంలోకి వచ్చేసరికి ట్యాంకరు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం పాన్‌షాపును బలంగా ఢీకొట్టి కాకతీయ హోటల్ భవనం సెల్లార్లోపలికి దూసుకుపోయింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. సపోర్ట్ స్తంభం ధ్వంసమైంది. పాన్‌షాపు కూడా ధ్వంసమై అందులో ఉన్న సామగ్రి పాడైపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరాయయ్యాడు. విషయం తెలుసుకున్న హైవే పోలీసులు, పరవాడ సీఐ బీసీహెచ్.స్వామినాయుడు, ఎస్ఐ వెంకటరావులు సంఘటన స్థలానికి చేరుకొని హోటల్ సెల్లార్లోకి దూసుకుపోయిన గ్యాస్ టాంకరును క్రేన్ సాయంతో తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
తాగిన మైకంలో కరెంటు స్తంభం ఎక్కి..
హైదరాబాద్: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మద్యం మత్తులో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ స్తంభం ఎక్కాడు. తీగలు పట్టుకోవడంతో విద్యుదాఘాతంతో కింద పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఆ వ్యక్తి బతికే ఉన్నాడనుకుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షం బీభత్సం
సాక్షి, నెట్వర్క్: మెదక్, రంగారెడ్డి జిల్లాలను శనివారం కూడా వర్షం ముంచెత్తింది. మెదక్ జిల్లా సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ప్రభావంతో విద్యుత్ స్తంభాలు పడిపోవడం, తీగలు తెగిపోవడంతో సిద్దిపేట పట్టణం అంధకారంలో మునిగిపోయింది. ఇక్కడ 45 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. హైదరాబాద్, మెదక్, ఇతర ప్రధాన రహదారులపై రాకపోకలు స్తంభించాయి. గజ్వేల్ నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వడగళ్ల వాన పడింది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఆరు లేన్ల రహదారి పనుల్లో భాగంగా బిగించిన విద్యుత్ స్తంభాలు ఈదురుగాలులకు వంగిపోయాయి. రద్దీగా ఉండే రహదారిపై ఇవి వంగిపోవడంతో ప్రయాణికులు భీతిల్లారు. ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. చేవెళ్ల మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ వర్షానికి క్యారెట్, బీట్రూట్ తదితర పంటలకు నష్టం జరిగింది. మొయినాబాద్ మండలంలో పిడుగుపాటుతో 4 పశువులు మత్యువాత పడ్డాయి. శంషాబాద్, కందుకూరు మండలాల్లో భారీ వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. కొలన్‌గూడలో వడగళ్ల ధాటికి బండ నర్సింహాకు చెందిన 5 గొర్రెలు, 5 మేకలు మృతి చెందాయి. కందుకూరు మండలం బేగంపేటలో ఈదురుగాలులకు దెయ్యాల ఐలయ్య ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. గ్రామంలోని వ్యవసాయ పొలంలో యాదయ్యకు చెందిన ఇల్లు కూలిపోయి ఆయన భార్య యాదమ్మకు స్వల్పగాయాలయ్యాయి. శంషాబాద్ మండలం చిన్నగోల్కొండలో దాదాపు పది ఇళ్ల రేకులు లేచిపోయాయి. -
విద్యుత్ స్తంభం నుంచి జారిపడి వ్యక్తి మృతి
గార : విద్యుత్ స్తంభం నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం ఉప్పరపేటలో బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని సాలిహుండం గ్రామానికి చెందిన జల్లు వనజయ్య(48) అనే వ్యక్తి గ్రామంలో విద్యుత్ స్తంభాలకు లైట్లు బిగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
టవరెక్కిన యువకుడు
రంగారెడ్డి: యజమాని తిట్టడంతో మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని విద్యుత్ పోల్ ఎక్కి వీరంగం సృష్టించాడు. బుధవారం యజమాని మందలించడంతో నిజాం అనే వ్యక్తి ఆరాంఘర్ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న 33 కేవీ విద్యుత్ టవరెక్కాడు. ఫ్యాక్టరీ యజమాని, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వచ్చి తన సమస్యను తీర్చాలని అప్పటివరకు దిగిరానని మారాం చేస్తున్నాడు. అతన్ని దింపడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.