పంజగుట్ట: వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భర్త చనిపోయాడంటూ ఓ మహిళ పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నాగార్జునాసాగర్ వద్ద ఎస్‌పీఎఫ్ పోలీస్ విభాగంలో పనిచేసే ఎం. శంకర్(38) దవడ నొప్పితో బాధపడుతూ.. ఈ నెల 19వ తేదీన నిమ్స్‌లో అడ్మిట్ అయ్యాడు. వైద్యపరీక్షలు పూర్తిచేసిన బరడా పి.డి. సాహూ వైద్య బృందం శంకర్‌కు 25వ తేదీన శస్త్ర చికిత్స నిర్వహించారు. అనంతరం రోగి పరిస్థితి చెప్పమని శంకర్ భార్య మాధవి ఎన్ని సార్లు వైద్యులను అడిగినా వారు స్పందించలేదు.
తెలిసిన మరో వైద్యునితో మాధవి బంధువులు నిమ్స్ వైద్యులకు ఫోన్ చేయించి రోగి పరిస్థితి గూర్చి వాకబు చేయగా శంకర్ బ్రైయిన్‌డెడ్ అయ్యారని తెలిపారు. కోమాలో ఉన్న శంకర్ గురువారం ఉదయం మృతిచెందినట్లు వైద్యులు తెలపడంతో శంకర్ భార్య మాధవి తన భర్త నడుచుకుంటూ వచ్చి నిమ్స్‌లో అడ్మిట్ అయ్యారని కేవలం దవడ నొప్పి ఉంటే వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతో మృతిచెందాడని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించి ఇద్దరు వైద్యులు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దవడ నొప్పికి చికిత్స చేస్తే.. బ్రెయిన్‌డెడ్‌తో మృతి
Published Thu, May 28 2015 11:01 PM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM
Advertisement
Advertisement