ఆర్కే-5బీ సెక్షన్ మూసివేత! | management ready to close rk-5b from this month 15th | Sakshi
Sakshi News home page

ఆర్కే-5బీ సెక్షన్ మూసివేత!

Published Sun, May 11 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

management  ready to close rk-5b from this month 15th

 శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 ఇంక్లయిన్ పరిధిలోని 5బీ సెక్షన్‌ను ఈ నెల 15 నుంచి మూసివేయడానికి యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి శనివారం గనిపై నోటీస్‌ను కూడా వేశారు. ఇక ఆర్కే-5 ఇంక్లయిన్ నుంచే వర్క్ డిస్ట్రిబూషన్ జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో ఆర్కే-5 ఇంక్లయిన్ ఒక్కటే ఉండేది. గని లోపలికెళ్లిన కొద్ది పనిస్థలాలు దూరం అయ్యాయి. దీంతో పదమూడేళ్ల క్రితం యాజమాన్యం మరో టన్నెల్ తవ్వి దానికి 5బీ సెక్షన్‌గా నామకరణం చేసి నడిపిస్తూ వస్తోంది.

 ఆర్కే-5 ఇక్లయిన్ మేనేజర్ పరిధిలోనే వ్యహారాలు ఉన్న ఈ సెక్షన్‌కు ప్రత్యేక అధికారులు, సూపర్‌వైజర్లు, కార్మికులు ఉన్నారు. ల్యాంప్‌రూం, మ్యాగ్జిన్ కూడా వేరువేరుగా ఉన్నాయి. రెండు మ్యాన్‌వేలు, రెండు హాలేజీ వేల ద్వారా బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. ఆర్కే-5 గని పరిధిలో మొత్తం 2,100 మంది ఉంటే అందులో 5బీ సెక్షన్‌లో 700 మంది కార్మికులు.. అధికారులు, సూపర్‌వైజర్ సిబ్బంది 60 మంది వరకు పని చేస్తున్నారు. ఎక్కడికక్కడే వర్క్‌డిస్ట్రిబూషన్‌లు జరుగుతాయి. ఆర్కే-5 ఇక్లయిన్‌కు మేనేజర్ ఉన్న 5బీ సెక్షన్ కోసం ప్రత్యేక ఇన్‌చార్జి ఉన్నారు. ఈ రెండింటిలో ఎస్‌డీఎల్, హ్యాండ్ సెక్షన్ ద్వారా బొగ్గు తీస్తున్నారు. పైన రెండు వేరువేరుగా ఉన్న లోపల మాత్రం పనిస్థలాలు అనుసంధాన మయ్యే ఉంటాయి. అయితే గతేడాది ఉత్పత్తి లక్ష్యం 6.35 లక్షలు ఉందని, ఈ యేడు కొత్త పనిస్థలాలకు అనుమతి లేకపోవడంతో ఉత్పత్తి లక్ష్యాన్ని 4 లక్షలకు త గ్గించి పెట్టారని ఇంతదానికి రెండింటి నుంచి వ్యవహారాలు నడిస్తే నష్టం వస్తుందని పేర్కొంటు 5బీ సెక్షన్‌ను మూసి వేస్తున్న అధికారులు పేర్కొంటున్నారు.

 ఆర్కే-5 నుంచే పనులు
 ఇక 5బి సెక్షన్ కార్మికులంతా ఈ నెల 15 నుంచి ఆర్కే 5 నుంచే విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆర్కే 5గని లోపల నుంచే  5బీ సెక్షన్‌లో ఉండే పనిస్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది చాలా దూరం అవుతుందని కార్మికులు పేర్కొంటున్నారు. ఐతే ఈ రెండు గనులను కలుపుతు లెవల్‌మ్యాన్ ైరె డింగ్ ఇప్పటికే వేసి ఉందని, 5బీ సెక్షన్ నుంచి దిగి వెళ్లిన 5 ఇంక్లయిన్ నుంచి దిగి వెళ్లిన కార్మికులు నడక ప్రయాస ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. పాలన పరమైన సర్దుబాటే తప్ప కార్మికులకు నష్టం ఏమి లేద ని అధికారుల వాదన.

 వ్యూహాత్మకంగానే మూసివేత
 గనిలో ప్రస్తుతం హ్యాండ్ సెక్షన్, ఎస్‌డీఎల్ రెండు సెక్షన్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరిగేది. ఇకపై హ్యాండ్ సెక్షన్‌ను బంద్ చేయనున్నారని తెలిసింది. కారణం కొత్త హ్యాండ్ సెక్షన్ పనిస్థలాలకు అనుమతులు లేవనే కారణంతో ఈ సంవత్సరం ఉత్పత్తి లక్ష్యం గత యేడు కంటే 2.3 లక్షల టన్నులు తక్కువగా పెట్టారు. దీంతో కార్మికుల సంఖ్యను కుదించడంలో భాగంగా ఇప్పటికే 150 మందిని ఇతర గనులకు బదిలీ చేశారు. ఈ నెల 15 తరువాత 5బీ సెక్షన్ మూసివేస్తే మరో 300 మందిని బదిలీ చేస్తారని తెలిసింది. హ్యాండ్ సెక్షన్ నుంచే ఈ బదిలీలు జరుగుతాయని అంటున్నారు. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. హ్యాండ్ సెక్షన్ మూసి వేసి గనిని పూర్తిగా ఎస్‌డీఎల్స్ ద్వారానే నడుపాలని నిర్ణయానికి వచ్చారని తెలిసింది. భవిష్యత్‌లో కంటిన్యూయస్ మైనర్ ఆలోచనతోనే యాజమాన్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని వినిపిస్తుంది. దీని కోసంమే 5బీ సెక్షన్‌ను మూసేస్తున్నారు.

 పని వేళలు కూడా మార్పు
 కొన్ని నెలల నుంచి  5బి సెక్షన్‌లో పాత పని వేళలు తీసేసి కొత్త పనివేళలు పెట్టారు. జనరల్ షిఫ్ట్‌ను ఉదయం 5 గంటల నుంచి షిఫ్ట్‌ను 8 గంటల నుంచి పెట్టారు. దీనిపై తీవ్ర వ్యతిరేక వచ్చిన అధికారులు పట్టించుకోకుండా ఈ పని వేళలే కొనసాగిస్తున్నారు. ఇదే పనివేళలను కొద్ది రోజుల క్రితం ఆర్కే 5గనిలో పెట్టాలని చూస్తే తీవ్ర వ్యతిరేక రావడంతో యాజమాన్యం వెనక్కు తగ్గింది. ఇప్పుడు 5బీ సెక్షన్ మూసి వేసిన తరువాత ఈ ఆర్కే 5గనిలో కూడా కొత్త పనివేళలు పెట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై కూడా కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు తమ సొంత ప్రాపకాన్ని పూర్తి స్థాయి అధికారులకు చూపేందుకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తు గనిని నాశనం చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైన 15వ తేదీ తరువాత ఆర్కే 5గనిలో చోటు చేసుకొనే పరిస్థితులు ఆసక్తికరంగానే ఉండే అవకాశం ఉంది.

 ఉత్పత్తి లక్ష్యం తక్కువగా ఉందని..
 ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే 2.3 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం తక్కువగా పెట్టారు. రెండు గనుల నుంచి డిస్ట్రిబూషన్, రెండు ల్యాంప్‌రూం వంటి అన్ని రెండు చోట్ల నుంచి నిర్వాహణ అవసరం లేదని భావించాం. 15 నుంచి ఒకే చోటు నుంచి వర్క్‌డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయించాం. ఇంకా దీనిపై చర్చలు జరుగుతున్నాయి. పూర్తిగా ఫైనల్ కావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement