ఆత్మకూర్ : దళితుల వర్గీకరణ ముసుగులో క్రైస్తవుడైన ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణమాదిగ అలియాస్ హేలియా నిజమైన దళితులకు అన్యాయం చేస్తున్నాడని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు కర్ని శ్రీశైలం ఆరోపించారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అథితిగృహం ఆవరణలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న ఆయన మందకృష్ణపై విమర్శలుచేశారు. ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ మందకృష్ణ, వద్దంటూ జూపూడి ప్రభాకర్‌రావులు దళితులను అయోమయానికి గురిచేస్తున్నారని, వాస్తవానికి వారిరువురు క్రైస్థవులుగా కొనసాగుతున్నారని తెలిపారు.
దళితులకు అంబేద్కర్ కల్పించిన ఫలాలను క్రైస్థవులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయమై త్వరలో యుద్ధభేరి మోగిస్తామని వెల్లడించారు. అనంతరం పలు విషయాలపై చర్చించి ఓ తీర్మాణం తయారు చేశారు. కార్యక్రమంలో సంఘం జాతీయ కార్యదర్శి యాంకి లింగన్న, కేషవులు, బలరాం, రాములమ్మ, రాష్ట్ర కో కన్వీనర్ నర్సింహయ్య, జిల్లా అధ్యక్షుడు యాంకి రమేష్, ప్రధాన కార్యదర్శి యాదయ్య, వెంకటేష్, గంధం రాజశేఖర్, దశరథరాముల తదితరులు పాల్గొన్నారు.
‘మందకృష్ణ దళితులను మోసం చే స్తుండు’
Published Sat, Sep 6 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM
Advertisement
Advertisement