పట్టాలు తప్పిన మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్
ఖమ్మం: మణుగూరు రైల్వేస్టేషన్‌లో మణుగూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లవలసిన మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సోమవారం రాత్రి పట్టాలు తప్పింది. దీంతో ఆ రైలు రద్దయింది. అదే విధంగా మణుగూరు రైల్వే స్టెషన్ నుంచి వెళ్లవలిసిన కాకతీయ ప్యాసింజర్ రైలును కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మణుగూరు వచ్చే ఈరైలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మణుగూరు స్టేషన్‌లోని లూప్ లైన్‌లో ఉంచుతారు. రాత్రి 9.45కు వెళ్లవలసిన ఈరైలు బోగీలను లూప్ లైన్ నుంచి ప్లాట్ పామ్‌కు పెట్టే క్రమంలో లైన్ క్రాసింగ్ వద్ద ఇంజన్ వెనకాల ఉన్న మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద కారణాలు పూర్తిగా తెలియరాలేదని రైల్వే అధికారులు తెలిపారు.
పట్టాలు తప్పిన బోగీలను సరిచేయడానికి సమయం పడుతుందని దీనివలన ఈరోజు సూపర్ పాస్టుతోపాటు కాకతీయ ప్యాసింజర్ ను సైతం రద్దుచేసే అవకాశాలు ఉన్నాయిని స్టేషన్ మాస్టర్ తెలిపారు. అధికారులు పూర్తిస్తాయిలో రద్దుచేస్తున్నట్లు దృవీకరించకపోవడంతో ప్రయాణికులు కొంత ఇబ్బందిపడ్డారు. స్దానికంగా ఉన్నవారు వెనుదిరిగినప్పటికీ పినపాక, అశ్వాపురం మండలాలనుంచి వచ్చిన వారు వెళ్లడానికి రవాణా సౌకర్యంలేక అక్కడే ఉన్నారు. పండుగ సెలవు కావడంతో పెద్ద ఎత్తున జనం రైల్వే స్టేషన్‌కు వచ్చారు.
(మణుగూరు)