Superfast express
-
పట్టాలు తప్పిన మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్
ఖమ్మం: మణుగూరు రైల్వేస్టేషన్లో మణుగూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లవలసిన మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సోమవారం రాత్రి పట్టాలు తప్పింది. దీంతో ఆ రైలు రద్దయింది. అదే విధంగా మణుగూరు రైల్వే స్టెషన్ నుంచి వెళ్లవలిసిన కాకతీయ ప్యాసింజర్ రైలును కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మణుగూరు వచ్చే ఈరైలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మణుగూరు స్టేషన్‌లోని లూప్ లైన్లో ఉంచుతారు. రాత్రి 9.45కు వెళ్లవలసిన ఈరైలు బోగీలను లూప్ లైన్ నుంచి ప్లాట్ పామ్‌కు పెట్టే క్రమంలో లైన్ క్రాసింగ్ వద్ద ఇంజన్ వెనకాల ఉన్న మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద కారణాలు పూర్తిగా తెలియరాలేదని రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన బోగీలను సరిచేయడానికి సమయం పడుతుందని దీనివలన ఈరోజు సూపర్ పాస్టుతోపాటు కాకతీయ ప్యాసింజర్ ను సైతం రద్దుచేసే అవకాశాలు ఉన్నాయిని స్టేషన్ మాస్టర్ తెలిపారు. అధికారులు పూర్తిస్తాయిలో రద్దుచేస్తున్నట్లు దృవీకరించకపోవడంతో ప్రయాణికులు కొంత ఇబ్బందిపడ్డారు. స్దానికంగా ఉన్నవారు వెనుదిరిగినప్పటికీ పినపాక, అశ్వాపురం మండలాలనుంచి వచ్చిన వారు వెళ్లడానికి రవాణా సౌకర్యంలేక అక్కడే ఉన్నారు. పండుగ సెలవు కావడంతో పెద్ద ఎత్తున జనం రైల్వే స్టేషన్‌కు వచ్చారు. (మణుగూరు) -
హైదరాబాద్ కు సూపర్ ఫాస్ట్ ప్రతిపాదన
- పలురైళ్ల హాల్టింగ్‌కు విన్నపం - రైల్వే బడ్జెట్ కోసం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదనలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు పగటిపూట సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను వేయాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 2015-16 బడ్జెట్ కోసం ప్రతిపాదన పెట్టారు. రైల్వే బడ్జెట్ ప్రతిపాదనలపై మంగళవారం విజయవాడలో జరగననున్న జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ ఏర్పాటు చేస్తున్న సమావేశంలో కూడా ఆయన పాల్గొని తన వాదన వినిపించనున్నారు. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏర్పాటుపై ఆయన ఇప్పటికే రైల్వే మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ముంబై నుంచి గుంటూరుకు వయా గుంతకల్ మీదుగా కొత్త రైలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల కర్నూలు, మహబూబ్‌నగర్, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని వేలాదిమంది ముంబైలో నివసించే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదించారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు గిద్దలూరు మీదుగా మరో ఎక్స్‌ప్రెస్ రైలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఒంగోలు నుంచి దొనకొండ రైల్వే లైను, ఒంగోలులో ఏర్పాటు చేసే ఎస్కలేటర్లు, లిఫ్ట్ల్, నడికుడి నుంచి శ్రీకాళహస్తి రైల్వే లైను, గుంటూరు వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన రైలునీర్ ప్లాంట్ ప్రగతిపై నివేదిక కావాలని కోరారు. పలు రైళ్లను పొడిగించాలని కోరారు. విశాఖపట్నం నుంచి గుంటూరు వరకూ వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నంద్యాల వరకూ పొడిగించాలని, గుంటూరు - ద్రోణాచలం మధ్య నడిచే రైలును గుంతకల్ వరకూ పొడిగించాలని కోరారు. నంద్యాల - కర్నూలు మధ్య నడుస్తున్న డెమో రైలును గిద్దలూరు వరకూ, తెనాలి మార్కాపురం మద్య నడుస్తున్న రైలును గిద్దలూరు వరకూ, సాయినగర్ షిర్టీ నుంచి విజయవాడ వరకూ నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ను గూడూరు జంక్షన్ వరకూ పొడిగించాలని ఆయన ప్రతిపాదించారు. ఒంగోలు స్టేషన్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ స్టేషన్ కావదడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, ముఖ్యంగా కేరళా, బీహార్, హిమాచలప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నందున వారికి అనుగుణంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చే సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఒంగోలులో ఆగేలా చూడాలని కోరారు. ఒంగోలులో ఆగాల్సిన రైళ్లు చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్, చెన్నై - జోధ్‌పూర్ - చెన్నై మధ్య నడిచే జోద్పూర్ ఎక్స్‌ప్రెస్, చెన్నై - జైపూర్ - చెన్నై మధ్య నడిచే జైపూర్ ఎక్స్‌ప్రెస్, పొండిచ్చేరీ - న్యూఢిల్లీ - పాండిచ్చేరీ మధ్య నడిచే పాండిచ్చేరీ ఎక్స్‌ప్రెస్‌లకు ఒంగోలులో హాల్ట్ ఇవ్వాలని కోరారు. టంగుటూరులో ఆగాల్సిన రైళ్లు... తిరుపతి - విశాఖపట్నం మధ్య నడిచే తిరుమలా ఎక్స్‌ప్రెస్, చెన్నై - ఎగ్మోర్ మధ్య నడిచే సర్కార్ ఎక్స్‌ప్రెస్, చెన్నై - హైదరాబాద్ మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్. గూడూరు - హైదరాబాద్ నడుమ నడిచే సింహపూరి ఎక్స్‌ప్రెస్. సింగరాయకొండలో నిలపాల్సిన రైళ్లు... హైదరాబాద్ - కొచ్చిన నడుమ నడిచే శబరి ఎక్స్‌ప్రెస్, తిరుపతి - సికింద్రాబాద్ మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్, చైన్నై - హైదరాబాద్ మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం - తిరుపతి మధ్య నడిచే మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్. దొనకొండలో ఆగాల్సిన రైళ్లు హౌరా వెళ్లే ఎస్ఎస్పిఎన్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలు. కురిచేడులో ఆగాల్సిన రైళ్లు.. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ గిద్దలూరులో ఆగాల్సిన రైళ్లు పూరీ నుంచి బెంగళూరు వెళ్లే గరీబ్ధ్ -
ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం: రైళ్ల రద్దీ దృష్ట్యా మరో రెండు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సికింద్రాబాద్-సాంత్రగచ్చి, విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడుపుతున్నట్టు తూర్పు కోస్తా రైల్వే గురువారం ప్రకటించింది. దసరాతో పాటు దీపావళిని పురస్కరించుకుని ఈ రెండు రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం స్పెషల్ : అక్టోబర్ 5వ తేదీన ప్రయాణికుల రద్దీ దష్ట్యా ఆ రోజు సికింద్రాబాద్-విశాఖ మధ్య సూపర్‌ఫాస్ట్(02742) ప్రత్యేక రైలును నడుపుతున్నారు. 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు విశాఖకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-సికింద్రాబాద్(02741) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖలో ఈ నెల 6వ తేదీ రాత్రి 7.05 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 7.05 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ప్రీమియం రైళ్లు సికింద్రాబాద్-సాంత్రగచ్చి(02774) ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 20న ఉదయం 7.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 7.15 గంటలకు విశాఖకు చే రి మళ్లీ 7.35 గంటలకు బయల్దేరి 21వ తేదీ ఉదయం 9.45 గంటలకు సాంతగచ్చి చేరుతుంది. సాంత్రగచ్చి-సికింద్రాబాద్(02773) ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21న రాత్రి 8.40 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు విశాఖకు చేరుకుని తిరిగి 9.50 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. -
సూపర్‌ఫాస్ట్ రైళ్లుగా ఐదు దురంతోల మార్పు
న్యూఢిల్లీ: చెన్నై-అమృత్సర్, హౌరా-పూరి, కోయంబత్తూరు-చెన్నై, చెన్నై-త్రివేండ్రం, అజ్మీర్-నిజాముద్దీన్‌ల మధ్య నడుపుతున్న నాన్‌స్టాప్ దురంతో రైళ్లను సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చినట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇక నుంచి ఈ రైళ్లలో ఎక్కువ స్టాపులు ఉంటాయని, ప్రయాణికులు వారు వెళ్లాల్సిన గమ్యస్థానాలకు తగ్గట్లుగా చార్జీలు చెల్లించవచ్చని పేర్కొన్నారు. 2009లో నాటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన ఈ దురంతోలకు ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.