ప్రత్యేక రైళ్లు | Special Trains | Sakshi
Sakshi News home page

ప్రత్యేక రైళ్లు

Published Fri, Oct 3 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM

ప్రత్యేక రైళ్లు

ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం: రైళ్ల రద్దీ దృష్ట్యా మరో రెండు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సికింద్రాబాద్-సాంత్రగచ్చి, విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడుపుతున్నట్టు తూర్పు కోస్తా రైల్వే గురువారం ప్రకటించింది. దసరాతో పాటు దీపావళిని పురస్కరించుకుని ఈ రెండు రైళ్లను నడుపుతోంది.
 
సికింద్రాబాద్-విశాఖపట్నం స్పెషల్ : అక్టోబర్ 5వ తేదీన ప్రయాణికుల రద్దీ దష్ట్యా ఆ రోజు సికింద్రాబాద్-విశాఖ మధ్య సూపర్‌ఫాస్ట్(02742) ప్రత్యేక రైలును నడుపుతున్నారు. 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు విశాఖకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-సికింద్రాబాద్(02741) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖలో ఈ నెల 6వ తేదీ రాత్రి 7.05 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 7.05 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
 
 ప్రీమియం రైళ్లు
 సికింద్రాబాద్-సాంత్రగచ్చి(02774) ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 20న ఉదయం 7.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 7.15 గంటలకు విశాఖకు చే రి మళ్లీ 7.35 గంటలకు బయల్దేరి 21వ తేదీ ఉదయం 9.45 గంటలకు సాంతగచ్చి చేరుతుంది.
     
 సాంత్రగచ్చి-సికింద్రాబాద్(02773) ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21న రాత్రి 8.40 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు విశాఖకు చేరుకుని తిరిగి 9.50 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement