న్యూఢిల్లీ: చెన్నై-అమృత్‌సర్, హౌరా-పూరి, కోయంబత్తూరు-చెన్నై, చెన్నై-త్రివేండ్రం, అజ్మీర్-నిజాముద్దీన్‌ల మధ్య నడుపుతున్న నాన్‌స్టాప్ దురంతో రైళ్లను సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చినట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇక నుంచి ఈ రైళ్లలో ఎక్కువ స్టాపులు ఉంటాయని, ప్రయాణికులు వారు వెళ్లాల్సిన గమ్యస్థానాలకు తగ్గట్లుగా చార్జీలు చెల్లించవచ్చని పేర్కొన్నారు. 2009లో నాటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన ఈ దురంతోలకు ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.