తాళం వేసి ఉన్న నగల దుకాణాలలో దొంగలు పడి సుమారు రూ. 7 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన వరంగల్ నగరంలోని కాశిబుగ్గ బాలాజీనగర్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఉదయం దుకాణం తెరవడానికి వచ్చిన యజమాని ఇది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
స్థానిక శ్రీ లక్ష్మీ గణపతి జ్యువెలరీస్‌తో పాటు రాజ్ సత్యనారాయణ జ్యువెలరీస్ దుకాణాల షెటర్లు లెపిన దుండగులు అందులో ఉన్న బంగారు ఆభరణాలతో ఉడాయించారు. శ్రీలక్ష్మీ గణపతి జ్యువెలరీస్‌లో 30 తులాల బంగారు, అరకిలో వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లగా.. రాజ్ సత్యనారాయణ నగల దుకాణంలో 8 తులాల బంగారు, కిలో వెండి ఆభరణాలతో ఉడాయించారని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.
నగల దుకాణంలో భారీ చోరీ
Published Wed, Feb 3 2016 10:22 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM
Advertisement
Advertisement