కర్బన ఉద్గారాల తగ్గింపునకు చర్యలు | Measures to reduce carbon emissions says central | Sakshi
Sakshi News home page

కర్బన ఉద్గారాల తగ్గింపునకు చర్యలు

Published Wed, Apr 29 2015 3:10 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

కర్బన ఉద్గారాల తగ్గింపునకు చర్యలు - Sakshi

కర్బన ఉద్గారాల తగ్గింపునకు చర్యలు

లోక్‌సభలో పొంగులేటి ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ: దేశంలో 1301.21 మిలియన్ టన్నుల కార్బన్ డయాకై్సడ్‌కు సమానమైన గ్రీన్‌హౌస్ ఉద్గారాలు ఉన్నాయని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ అంశంపై లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఆ పార్టీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. మొత్తం ఉద్గారాల్లో 67 శాతం ఇంధన రంగం నుంచి, 23 శాతం వ్యవసాయ రంగం నుంచి, 6 శాతం పరిశ్రమల నుంచి, 4 శాతం వ్యర్థ రంగం నుంచి వెలువడుతున్నాయని తెలిపారు. దేశంలో ఈ ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని వివరించారు. 1,75,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇందులో లక్ష మెగావాట్ల సౌర విద్యుత్, 60 వేల మెగావాట్ల పవన విద్యుత్ ఉన్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement