ప్రభాకర్ (ఫైల్)
మెదక్ రూరల్: బతుకుదెరువు కోసం విదేశానికి వెళ్లిన ఓ రైతు అక్కడే గుండెపోటుతో మృతిచెందాడు. మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం శమ్నాపూర్‌కి చెందిన జాల ప్రభాకర్ (32) సాగు కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఉపాధి కోసం గతేడాది డిసెంబర్ 31న మలేసియాకు వెళ్లాడు. అక్కడే కూలి పనులు చేస్తున్న ప్రభాకర్ ఈ ఏడాది మార్చి 27న గుండెపోటుతో చనిపోయాడు. ప్రభాకర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని అతని కుటుంబసభ్యులు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే చొరవతో ఎట్టకేలకు 40 రోజుల తర్వాత స్వగ్రామమైన శమ్నాపూర్‌కు మంగళవారం ప్రభాకర్ మృతదేహం చేరుకుంది. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment