సత్తుపల్లి రూరల్ (ఖమ్మం) : జ్వరాలు వ్యాపించకుండా అదుపు చేసేందుకే అన్ని గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని సత్తుపల్లి క్లస్టర్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.భాస్కర్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్‌నగర్‌లో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. జ్వరపీడితుల నుంచి రక్తనమూనాలు సేకరించి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో గంగారం పీహెచ్‌సీ వైద్యాధికారిణి వైఎల్ ప్రశాంతి, హెచ్‌వీ అన్నమ్మ, హెచ్‌ఎస్ నర్సింహారావు, హెచ్‌ఈఈ శ్రీనివాస్, ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
'జ్వరాలు అదుపు చేసేందుకే వైద్య శిబిరాలు'
Published Sat, Sep 12 2015 7:47 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM
Advertisement