సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, పింఛన్‌దారులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని మరో మూడేళ్లు కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి గడువు ఈ నెల 31తో ముగియనుండగా ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. సుమారు 14 కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్‌కార్డుల అమలుపై స్తబ్ధత కొనసాగుతున్న విషయం తెలిసిందే.