పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఇన్నారెడ్డి
మందమర్రి రూరల్, న్యూస్‌లైన్ :
తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటే ప్రత్యక్ష పోరాటలకు దిగుతామని పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు టి.ఇన్నారెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో నిర్వహించిన పీఆర్‌టీయూ మండల శాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్రమైన తెలంగాణ బిల్లు పత్రులను చింపివే యడం సీమాంధ్రుల నీతిమాలిన తనానికి నిదర్శమన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి ఈ ప్రాంత మంత్రులు కృషి చేయాలన్నారు.
ఉపాధ్యాయుల పీఆర్‌సీ అమలులో భాగంగా 50 శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అది జూన్ నెల నుంచే అమలు చేయాలని వారు సమావేశంలో తీర్మానించారు. అంతే కాకుండా 2014 జనవరి నెలలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం రద్దవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు వెంటనే హెల్త్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు డి.అరవింద్‌కుమార్, నాయకులు మెకార్తి వెంకటేశ్వర్, ఎం.జాన్, జె.పోచయ్య, కర్నాల సత్యనారాయణ, రామస్వామి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ కు అడ్డుపడితే పోరుకు సిద్ధం
Published Tue, Dec 17 2013 6:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement
Advertisement