పెద్ద మల్లయ్య(ఫైల్)
జన్నారం(ఖానాపూర్): ఉపాధి వేటలో మరో వలసకూలీ మృతి చెందాడు. ఇప్పటికి 2017 సెప్టె ంబర్‌లో తపాలపూర్‌కు చెందిన శ్రీనివాస్, జూన్ 2017న చింతగూడకు చెందిన రాజన్న, జనవరి 10, 2018 లో కలమడుగు కు చెందిన ఒడ్డెపల్లి తిరుపతి, ఫిబ్రవరి 8న బాదంపల్లికి చెందిన తోట నాగరాజు ఉపాధి వేటలో ప్రాణాలొదిలారు. జన్నా రం మండలం బాదంపల్లి గ్రామ పంచా యతీ పరిధిలోని చింతలపల్లికి చెందిన పెద్దమల్లయ్య(40) గత సంవత్సరం రూ.1.50 లక్షలు అప్పుచేసి దుబాయ్ వెళ్లాడు.
అక్కడ యూటీపీ కం పనీలో కూలి పనిలో చేరాడు. నాలుగు రోజుల క్రితం పనిస్థలంలో తలకు బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్లా డు. కంపనీ సిబ్బంది ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి వి షమించి మృతి చెందాడు. అతనికి భా ర్య రాజవ్వ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మల్లయ్య మరణవార్త విన్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వం స్వగ్రామానికి చేర్చాలని రాజవ్వ వేడుకుంటోంది.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
దుబాయ్‌లో మృతి చెందిన పెద్ద మల్లయ్య మృత దేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. దుబాయ్‌లో మల్లయ్య పనిచేసిన కంపేనీతో సంప్రదింపులు జరుపుతున్నా. ప్రభుత్వ సహాయంతో మృతదేహాన్ని త్వరలోనే స్వగ్రామానికి తెప్పిస్తా. కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తా.– పాట్కూరి బసంతరెడ్డి, గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment