Migrant laborer
-
రాలిన మరో వలస కూలీ
జన్నారం(ఖానాపూర్): ఉపాధి వేటలో మరో వలసకూలీ మృతి చెందాడు. ఇప్పటికి 2017 సెప్టె ంబర్లో తపాలపూర్కు చెందిన శ్రీనివాస్, జూన్ 2017న చింతగూడకు చెందిన రాజన్న, జనవరి 10, 2018 లో కలమడుగు కు చెందిన ఒడ్డెపల్లి తిరుపతి, ఫిబ్రవరి 8న బాదంపల్లికి చెందిన తోట నాగరాజు ఉపాధి వేటలో ప్రాణాలొదిలారు. జన్నా రం మండలం బాదంపల్లి గ్రామ పంచా యతీ పరిధిలోని చింతలపల్లికి చెందిన పెద్దమల్లయ్య(40) గత సంవత్సరం రూ.1.50 లక్షలు అప్పుచేసి దుబాయ్ వెళ్లాడు. అక్కడ యూటీపీ కం పనీలో కూలి పనిలో చేరాడు. నాలుగు రోజుల క్రితం పనిస్థలంలో తలకు బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్లా డు. కంపనీ సిబ్బంది ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి వి షమించి మృతి చెందాడు. అతనికి భా ర్య రాజవ్వ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మల్లయ్య మరణవార్త విన్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వం స్వగ్రామానికి చేర్చాలని రాజవ్వ వేడుకుంటోంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా దుబాయ్లో మృతి చెందిన పెద్ద మల్లయ్య మృత దేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. దుబాయ్లో మల్లయ్య పనిచేసిన కంపేనీతో సంప్రదింపులు జరుపుతున్నా. ప్రభుత్వ సహాయంతో మృతదేహాన్ని త్వరలోనే స్వగ్రామానికి తెప్పిస్తా. కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తా.– పాట్కూరి బసంతరెడ్డి, గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్
- ఎస్పీ విశాల్ గున్నీ కోవూరు : ఎనిమిదేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. మంగళవారం సాయంత్రం కోవూరు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. కొడవలూరు మండలం గండవరంలో ఇటీవల పెద్దకాలువ కట్టవద్ద గిరిజన బాలికకు మాయమాటలు చెప్పి వలసకూలీ అయిన కత్తి శ్రీను గండవరం తిరునాళ్లకు తీసుకువెళ్లాడన్నారు. బాలికకు భోజనం పెట్టించి మాజా కూల్డ్రింక్స్ తీసిస్తాని నిర్మానుష ప్రదేశాన్ని తీసుకువెళ్లి విచక్షణారహితంగా అత్యాచారం చేశాడన్నారు. రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు వేగవంతం చేసి కోవూరులో నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేశామన్నారు. కత్తి శ్రీనుది జోన్నవాడ అని తెలిపారు. అక్కడ నుంచి వివిధ రకాల కూలి పనులు చేసుకుంటూ నెల్లూరు కాపువీధిలో ఉండేవాడన్నా రు. ఈ కేసు దర్యాప్తు చేసిన వారిలో సీఐ మాధవరావు, కొడవలూరు ఎస్ ఐ నారాయణరెడ్డి, ఐడీ పార్టీ సిబ్బం ది కృష్, విజయప్రసాద్ ఉన్నారు. నేరాల నియంత్రణకు చర్యలు విడవలూరు: జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విశాల్గున్నీ తెలిపారు. విడవలూరులోని పోలీస్స్టేషన్ను మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యంగా నేరాల నివారణకు చర్యలు తీసుకునే విధంగా తమ సిబ్బందికి సూచించామన్నారు. తీర ప్రాంతాల్లో పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎస్పీ వెంట నెల్లూరురూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, కోవూరు సీఐ మాధవరావు ఉన్నారు. -
మట్టిపెళ్లలు కూలి వ్యక్తి మృతి
బావి తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ మట్టిపెళ్లలు కూలి వలస కూలీ మృతిచెందగా.. మరో కూలీకి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీనవంక మండలం చల్లూరు గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ బావి తీయిస్తున్న క్రమంలో మట్టి పెడ్డలు కూలడంతో బావిలో పనిచేస్తున్న వలస కూలీ మల్లయ్య(40) మృతిచెందాడు. అదే సమయంలో బావిలో పనిచేస్తున్న మరో కూలీకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.