ఏడాదిలో దేవాదుల పూర్తి చేయాలి!
భూసేకరణ ప్రక్రియను వేగిరంచేయాలి
అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు
హైదరాబాద్: వచ్చే ఏడాది జూన్ నాటికి దేవాదుల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. దేవాదుల పథకానికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద కేంద్రం నిధులిస్తోందని, ఈ దృష్ట్యా నిర్ణీత సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని, లేకుంటే కేంద్రం వద్ద తెలంగాణ ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి సర్కిల్, డివిజన్ వారీగా యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. సరిగా పనులు చేయని ఏజెన్సీలను తొల గించి వేరే ఏజెన్సీలకు పనులు అప్పగించాలన్నారు. బుధవారం ప్రాజెక్టుపురోగతి, భూసేకరణ సమస్యలు.. తదితరాలపై సచివాలయంలోని సీ బ్లాక్ నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేవాదుల ప్రాజెక్టు పనుల్లో ఉదాసీనతను ఉపేక్షించేది లేదన్నారు.
నష్కల్, చెన్నూరు, పాలకుర్తి రిజ ర్వాయర్ల పనులను వేగవంతం చేయాలన్నా రు. దేవాదుల కింద వరంగల్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో 9,199 ఎకరాల మేర భూసేకరణ జరగాల్సి ఉండగా, 3,121 ఎకరాలను సేకరించారని, మిగతా భూమిని త్వరగా సేకరించాలని సూచించారు. ఇందుకు రెవెన్యూ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని, భూసేకరణలో చురుగ్గా పనిచేసే తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించాలని మంత్రి సూచించారు. ప్రధాని పర్యటన ముగిసిన అనంతరం రెండు రోజుల పాటు ఎస్సారెస్పీ రెండోదశ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తానన్నారు. కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించాలని సూచించారు. ఎస్సారెస్పీ రెండో దశకు 2,490 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇంకా 1,058 ఎకరాలు పెండింగ్‌లో ఉందని, దాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, దేవాదుల సీఈ వెంకటేశ్వర్లు, ఓఎస్‌డీ శ్రీధర్‌దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.
వచ్చే నెలలో ఎల్లంపల్లి నుంచి సాగుకు నీరు
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయి లో నీరు చేరుతున్న దృష్ట్యా పంటలకు నీరిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోం ది. తొలివిడతగా ప్రాజెక్టు పరిధిలోని 30వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయిం చింది. సెప్టెంబర్ తొలివారంలో ఈ నీటి ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రాజెక్టుపై సమీక్ష సందర్భం గా మంత్రి హరీశ్ అధికారులకు స్పష్టతనిచ్చారు. 20.18 టీఎంసీల సామర్థ్యము న్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో తొలిసారిగా 17.51 టీఎంసీల నీరు చేరింది. మేడారం పంప్‌హౌస్, గంగాధరం పంప్‌హౌస్‌కు సంబంధించి ఈ నెల 25న ట్రయల్న్ ్రనిర్వహించాలని సూచించారు.