సాక్షి, సిద్దిపేట : నగరంలోని అనేక ప్రాంతాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీశ్‌రావు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని మిట్టపల్లికి సమీపంలో రూ. 27.50 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ రోడ్డు పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '322 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కానుంది. దీని ద్వారా 5 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది. నిరుద్యోగుల ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటువల్ల ఈ ప్రాంత రైతుల భూములకు విలువ పెరగుతుంద'న్నారు. ఈ సందర్భంగా రోడ్డు కోసం భూములు కోల్పోయిన రైతులకు మంత్రి రూ.1.25 కోట్ల చెక్కును అందజేశారు.
యోగా పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు :
సిద్దిపేట పట్టణం టీటీసీ భవన్‌లో స్కూల్ గేమ్స్ పేడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 65వ తెలగాణా రాష్ట్ర స్థాయి యోగా పోటీల ముగింపు కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'యోగా మనిషి నిత్య జీవితంలో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండటానికి ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి యోగా పోటీల్లో పాల్గొనబోతున్న విద్యార్థులందరికీ అవార్డులు రావాలని కాంక్షించారు. రాబోయే రోజుల్లో అవకాశం ఉంటే సిద్ధిపేటలో జాతీయస్థాయి యోగా పోటీల నిర్వహణకు కృషిచేస్తామన్నారు. యోగా అనేది భారతదేశంలో ప్రాచీన కాలంలో ప్రముఖంగా ఉండేదని, నేడు పూర్వ వైభవం సంతరించుకున్నట్లు' మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment