Foundation stone program
-
శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణంతో మారనున్న ముఖచిత్రం
-
Hyderabad: గచ్చిబౌలిలో IAMC బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ
-
బంగారు తెలంగాణ చేసుకున్నం.. ఇక బంగారు భారతం చేద్దాం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసుకున్న మాదిరిగానే దేశాన్ని కూడా బంగారు భారతదేశంగా మార్చుకుందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. అమెరికా కంటే గొప్పగా మన దేశాన్ని తయారు చేసుకునే విధంగా ముందుకు వెళ్దామని అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘మనం అమెరికాకు వెళ్లడం కాదు, ఇతర దేశాల ప్రజలే మన దేశం వీసాలు తీసుకొని వచ్చే గొప్ప సంపద, వనరులు, యువశక్తి మనకున్నాయి. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర షోషించాలి. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఢిల్లీ వరకు కొట్లాడతా. నేను జాతీయ రాజకీయాల్లో పనిచేస్తున్నా.. పోదా మా? జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా..? ఢిల్లీ వరకు కొట్లాడుదామా..? దేశాన్ని బాగు చేసుకుందామా..?’అని కేసీఆర్ ప్రజలను ప్రశ్నిం చారు. దీంతో ‘కొట్లాడదాం..కొట్లాడదాం’అంటూ సభికులు ప్రతిస్పందించారు. ‘ఎక్కడైనా శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి.. మతం పేరు తో ఘర్షణలు పడితే పెట్టుబడులు రావు. దీనిపై గ్రామాల్లో చర్చించాలి. అన్ని వర్గాలు, కులాలు, మతాలు బాగుండాలి..’అని సీఎం ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు ‘తెలంగాణలో రైతులు చనిపోతే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా అమలు చేస్తున్నాం. ఎలాంటి లంచం ఇవ్వకుండానే రైతులకు రైతుబంధు అందుతోంది. ఠంచనుగా వారి ఖాతాల్లో పడుతోంది. రూ.రెండు వేలు పింఛన్లు ఇవ్వడంతో తెలంగాణాలోని వృద్ధులకు గౌరవం పెరిగింది. కల్యాణలక్ష్మి, విదేశీ విద్యకు రూ.20 లక్షలు స్కాలర్షిప్లు ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమతో 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. జహీరాబాద్ నిమ్జ్‌లో ఉద్యోగాలు రానున్నాయి..’అని కేసీఆర్ తెలిపారు. మన పథకాల కోసం మహారాష్ట్ర ప్రజల ఒత్తిడి రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మెచ్చుకున్నారని సీఎం చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రజలు ఈ పథకాలను తమకు కూడా అమలు చేయాల్సిందిగా తమపై ఒత్తిడి తెస్తున్నారని ఠాక్రే తెలిపినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు చీకట్లో ఉంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నది ఒక్క తెలంగాణలోనే అని చెప్పారు. రెండోసారి ప్రజలు దీవించడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. బహిరంగ సభలో ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి (నారాయణఖేడ్), చంటి క్రాంతికిరణ్ (అందోల్), మాణిక్‌రావు (జహీరాబాద్), మదన్‌రెడ్డి (నర్సాపూర్), పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు) తదితరులు పాల్గొన్నారు. చిమ్నీబాయి అనే ఓ గిరిజన మహిళను సీఎం కేసీఆర్ వేదికపైకి పిలిపించుకొని కాసేపు ముచ్చటించారు. చిమ్నీబాయిది సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్ తండా. గతంలో నారాయణఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా తాను ఆ తండాకు వెళ్లిన సందర్భంలో.. గ్రామంలోని సమస్యలను ఆమె వివరించిన విషయాన్ని మంత్రి హరీశ్ తన ప్రసంగంలో తెలిపారు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి తాగునీరు వస్తోందని, రోడ్డు సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. ఈ నేపథ్యంలో చిమ్నీబాయిని వేదికపైకి ఆహ్వానించిన కేసీఆర్, ఆ గ్రామం బాగోగులపై కాసేపు ముచ్చటించారు. -
ప్రజాబలంతో జగన్ సీఎం అయ్యారు
సాక్షి, నెల్లూరు జిల్లా: వెంకటాచం మండలం సర్వేపల్లిలో రూర్భన్ పథకం కింద రూ. 100 కోట్లతో చేపట్టిన పనులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి పైలాన్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు గౌతమ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు. అక్కడి నుంచి పూడిపర్తికి చేరుకుని నూతనంగా నిర్మించిన గ్రామసచివాలయం, వాటర్‌ట్యాంక్‌లు ప్రారంభించారు. అనంతరం సర్వేపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో మంత్రులు మాట్లాడారు. ప్రజాబలంతో వైఎస్ జగన్ సీఎం అయ్యారు: మంత్రి పెద్దిరెడ్డి 'ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆశయాలకు కట్టుబడి ఉన్నారు. ఆయన దొడ్డిదారిలో సీఎం కాలేదు. ప్రజా బలంతో తనను తాను నిరూపించుకొని, కష్టపడి సీఎం అయ్యారు. 19 నెలల్లోనే 90 శాతం మేనిఫెస్టో అమలు చేసిన ఘనత సీఎం జగన్‌ది. ముఖ్యమంత్రి మొక్కవోని దైర్యంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. వైఎస్ జగన్ ఒక సుదీర్ఘ విజన్‌తో పనిచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే.. వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. గత ప్రభుత్వాలు ఏవీ కూడా ఇంతపెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేయలేదు. ఏ ఎన్నికల్లో అయినా మీరు మన పార్టీలో ఎవరికి ఓటు వేసినా అది వైఎస్ జగన్‌కే ఓటేసినట్లు భావించి వేయండి' అంటూ మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ పోరాట పటిమ దేశానికే ఆదర్శం: డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటపటిమ దేశానికే ఆదర్శం. కష్టపడి, ప్రజాబలంతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. చంద్రబాబు దొడ్డి దారిలో, మామాకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు. మన ముఖ్యమంత్రికి మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానం. ప్రజల కోసం నిత్యం శ్రమించే ముఖ్యమంత్రి జగన్‌ని తిరుపతి ఎన్నికల్లో ఆశీర్వదించండి' అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కోరారు. చంద్రబాబుని ఆ రాష్ట్రానికే పరిమితం చేద్దాం: మంత్రి అనిల్ '18 నెలలోనే మన ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. మేనిఫెస్టోలో 90 శాతం ఇప్పటికే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిది. ఇవాళ ప్రజల ఇంటి ముందే పాలన సాగుతోంది. సచివాలయాల ద్వారా అన్ని పనులు జరిగిపోతున్నాయి. తిరుపతి ఎన్నికలు ముఖ్యమంత్రి పనితీరుకి, గత ప్రభుత్వం అరాచకాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా చెప్పవచ్చు. తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో 3 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాం. చంద్రబాబుని ఆ రాష్ట్రానికే పరిమితం చేద్దాం. ప్రతిపక్ష నాయకుడిగా తనకి ఇక్కడ పనిలేకనే.. బాబు పక్క రాష్ట్రంలో ఉండి పోయాడు. లోకేష్ ట్రాక్టర్ని ఉప్పుటేరులో పడేసినట్టే.. టీడీపీని కూడా సముద్రంలో ముంచడం ఖాయం. కోవిడ్ సాకు చూపి ముఖ్యమంత్రి ఏ పధకం కూడా ఆపలేదు. అన్ని పనులు చెప్పిన సమయానికి చేసి ముఖ్యమంత్రి గ్రేట్ లీడర్ అనిపించుకుంటున్నారు' అని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. తిరుపతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలి: గౌతమ్‌రెడ్డి వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళల, పేదల ప్రభుత్వం. గత ప్రభుత్వం ఒట్టి ఎంవోయూల ప్రభుత్వం, మేము ఆచరణలో పారిశ్రామిక అభివృద్ధి చూపిస్తున్నాం. 18 నెలల్లోనే ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నామంటే మా ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమం, అభివృద్ధే కారణం. వచ్చే తిరుపతి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. బాబు విజన్ 2020 అనేవాడు.. 2020లో కరోనా వచ్చింది: కాకాణి తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి పార్టీకి తీరనిలోటు. రేపు జరగబోయే తిరుపతి ఉపఎన్నికలో అభ్యర్థి ఎవరైనా వైఎస్సార్సీపీ అఖండ మెజారిటీతో గెలిపించాలి. గతంలో చంద్రబాబు విజన్ 2020 అనేవాడు. అంటే 2020లో కరోనా వచ్చింది. మళ్లీ విజన్ 2029 అంటున్నాడు. అప్పుడేం విపత్తు వస్తుందో..?. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న టైంలో పనిచేయడం ఇష్టం లేకపోతే దొంగ సంతకం పెట్టేవాడు. మంచికో సంతకం, చెడుకో సంతకం పెట్టే కుటిల నీతి చంద్రబాబు నైజం. వచ్చే తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు రాకుండా చేయాలి. నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టుల్లో, మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. నెల్లూరు జిల్లాలో ఒక బ్రూస్లీ ఉన్నాడు. ఆయనే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. సోమిరెడ్డికి ఈ సారి సర్వేపల్లి వైపు కన్నెత్తి చూసే దమ్ములేదు అంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. -
అయోధ్య: భూమి పూజకు 250 మంది
అయోధ్య: అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న శ్రీరాముని మందిర నిర్మాణం భూమి పూజకు విచ్చేయండి అంటూ శ్రీరామభజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలను పంపుతోంది. ఆగస్టు 5న జరిగే ఆలయ నిర్మాణం పునాది రాయి కార్యక్రమానికి సుమారు 250 మంది అతిథులను పిలవనున్నట్లు సమాచారం. అయోధ్యలోని ప్రముఖ సాధువులు, రాముడి గుడి నిర్మాణం కోసం పోరాడిన వ్యక్తులు ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శనివారం ఆహ్వానం అందింది. (అయోధ్యలో బయటపడ్డ దేవతా విగ్రహాలు) అలాగే కొందరు కేంద్ర మంత్రులను, ఉత్తర ప్రదేశ్ మంత్రులతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందు పరిషత్ సీనియర్ ప్రతినిధులను కూడా భూమి పూజ కోసం ఆహ్వానించనున్నారు. కాగా రామ మందిరానికి జూన్ 10వ తేదీనే పునాదులు వేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. దీంతో ఆగస్టు 5న నిర్వహించనున్న ఈ భూమి పూజ కార్యక్రమం కాశీ, వారణాసి నుంచి వచ్చే ప్రముఖ పూజారుల సమక్షంలో జరగనుంది. (రామ మందిరం శంకుస్థాపనకు రండి) -
రామ మందిరం శంకుస్థాపనకు రండి
అయోధ్య: అయోధ్యలో భవ్య రామ మందిరం శంకుస్థాపనకు విచ్చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు శనివారం ఆహ్వానించింది. రామ మందిరం నిర్మాణానికి ఆగస్టు 3 లేదా 5వ తేదీన పునాది రాయి వేయనున్నట్లు ట్రస్టు అధికార ప్రతినిధి మహంత్ కమల్‌నయన్ దాస్, అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ వెల్లడిం చారు. నక్షత్రాలు, గ్రహాల కదలికల ఆధారంగా రెండు తేదీలను శుభ ముహూర్తాలుగా నిర్ణయించామని తెలిపారు. వీటిలో ఏదో ఒక తేదీన రామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. దేశంలో 10 కోట్ల కుటుంబాలను కలిసి నిర్మాణానికి అవసరమైన నిధులు సేకరిస్తామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. డిజైన్ ఖరారైన తర్వాత మూడు నుంచి మూడున్నరేళ్లలో గుడి నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. -
ఇండస్ట్రియల్ పార్క్‌కు హరీశ్‌రావు శంకుస్థాపన
సాక్షి, సిద్దిపేట : నగరంలోని అనేక ప్రాంతాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీశ్‌రావు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని మిట్టపల్లికి సమీపంలో రూ. 27.50 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ రోడ్డు పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '322 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కానుంది. దీని ద్వారా 5 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది. నిరుద్యోగుల ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటువల్ల ఈ ప్రాంత రైతుల భూములకు విలువ పెరగుతుంద'న్నారు. ఈ సందర్భంగా రోడ్డు కోసం భూములు కోల్పోయిన రైతులకు మంత్రి రూ.1.25 కోట్ల చెక్కును అందజేశారు. యోగా పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు : సిద్దిపేట పట్టణం టీటీసీ భవన్లో స్కూల్ గేమ్స్ పేడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 65వ తెలగాణా రాష్ట్ర స్థాయి యోగా పోటీల ముగింపు కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'యోగా మనిషి నిత్య జీవితంలో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండటానికి ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి యోగా పోటీల్లో పాల్గొనబోతున్న విద్యార్థులందరికీ అవార్డులు రావాలని కాంక్షించారు. రాబోయే రోజుల్లో అవకాశం ఉంటే సిద్ధిపేటలో జాతీయస్థాయి యోగా పోటీల నిర్వహణకు కృషిచేస్తామన్నారు. యోగా అనేది భారతదేశంలో ప్రాచీన కాలంలో ప్రముఖంగా ఉండేదని, నేడు పూర్వ వైభవం సంతరించుకున్నట్లు' మంత్రి తెలిపారు. -
కొత్త సచివాలయానికి శంకుస్థాపన
-
కొత్త సచివాలయానికి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ కొత్త భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. సచివాలయం డీ–బ్లాక్ వెనుక భాగం లోని పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్లో కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భూమి పూజ నిర్వహించారు. శృంగేరీ పీఠం వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు శుభసూచకంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సీఎం కేసీఆర్ కుడి చేతికి ఇమామ్ జామిన్ కట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కొప ల ఈశ్వర్, జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు. మాజీ మంత్రి హరీశ్‌రావు, సీఎస్ ఎస్.కె. జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.పద్మాచారి, సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులు పాల్గొన్నారు. పనులు ఇప్పుడే ప్రారంభం కావు.. కొత్త సచివాలయ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ గురువారం శంకుస్థాపన నిర్వహించినా పనులు ప్రారంభం కావడానికి కనీసం 3–4 నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. జూన్ ముగిసిన తర్వాత మరో నెలన్నరపాటు మంచి ముహూర్తాలు లేకపోవడంతో సీఎం కేసీఆర్ గురువారం శంకుస్థాపన నిర్వహించారు. ప్రస్తుత సచివాలయ భవనాల్లో వాస్తుదోషాలున్నాయని, సరైన సదుపాయాలు లేవన్న కారణంతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయంలోని ప్రస్తుత భవనాలన్నింటినీ కూల్చేసి ఒకే బ్లాక్‌గా కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయిం చింది. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపై అధ్యయనం కోసం రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం త్వరలో సమావేశమై సచివాలయం, ఎర్రమంజిల్‌లో ఏయే భవనాలను కూల్చాలి? ఏయే భవనాలను మనుగడలోకి ఉంచాలన్న అంశాన్ని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ నివేదిక అందిన తర్వాత భవనాల కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత సచివాలయం 10 బ్లాకులుగా 25.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. సచివాలయం చుట్టూ ఉన్న విద్యుత్‌శాఖ కార్యాలయాల భవనాలు, ఉద్యోగ సంఘాల భవనాలను స్వాధీనం చేసుకొని అందులో కలిపేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత భవనాలన్నీ కూల్చేసి నేలను సమాంతరంగా చదును చేయాలని ప్రభుత్వం భావి స్తోంది. 4 లక్షల నుంచి 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. సచివాలయానికి నలువైపులా రోడ్లు, సచివాలయం సముదాయం ఎదురుగా గార్డె న్లు, ఫౌంటెయిన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆర్కిటెక్ట్‌ల నుంచి ప్రభుత్వం డిజైన్లను సేకరిస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో రూ. 400 కోట్ల వ్యయంతో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మిస్తా మని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చేయనున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న అన్ని శాఖల కార్యాలయాలను ఆయా శాఖల పరిధిలోని హెచ్ఓడీ కార్యాలయాలకు తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బావా.. మన చాంబర్లను చూసుకొద్దామా? కొత్త సచివాలయ భవన శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన కేటీఆర్, హరీశ్‌రావు సరదాగా ఒకరినొకరు ముచ్చటించుకున్నారు. ‘‘బావా.. ఒక సారి మన చాంబర్లకు పోయి చూసుకొద్దామా?’’అని హరీశ్‌రావుతో కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కేటీఆర్, హరీశ్‌రావులకు అప్పట్లో సచివాలయంలో ప్రత్యేక చాంబర్లు ఉండేవి. ప్రస్తుతం వాటిని ఖాళీగా ఉంచారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన కేటీఆర్‌తో సచివాలయ ఉద్యోగులు అరగంటపాటు సెల్ఫీలు దిగారు. -
శంకుస్థాపన’కు మహామహులు
- 1,500 మందిని ఆహ్వానించాలని ప్రభుత్వ నిర్ణయం - ప్రధాని చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి 1,500 మంది వీవీఐపీలను, వీఐపీలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 22వ తేదీ విజయదశమి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనికి అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పార్లమెంటు సభ్యులందరినీ ఆహ్వానించనుంది. సుప్రీంకోర్టు సీజేతోపాటు రాష్ట్రానికి చెందిన సుప్రీం న్యాయమూర్తులను, హైకోర్టుసీజేతో పాటు, న్యాయమూర్తులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ ఆహ్వానాలు పంపనున్నారు. రాజధాని శంకుస్థాపనను పెద్ద ఎత్తున నిర్వహించడంతోపాటు సినిమా చిత్రీకరించాలని నిర్ణయించారు. దీన్ని నేషనల్ జియోగ్రఫీ చానల్‌కు అప్పగించాలని సీఆర్డీఏ నిర్ణయించడం తెలిసిందే. సింగపూర్, జపాన్ ప్రధానులు వచ్చే అవకాశం లేదు! ఇదిలా ఉంటే.. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి సింగపూర్, జపాన్ ప్రధానమంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆహ్వానించినప్పటికీ వారు వచ్చే అవకాశం లేదని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర దేశాల ప్రధానమంత్రులను ఆహ్వానిస్తే రారని, దీనికి ఒక విధానం ఉంటుందని ఆ అధికారి తెలిపారు. విదేశాంగ మంత్రిత్వశాఖ లేదా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇతర దేశాల ప్రధానమంత్రులకు ఆహ్వానాలు వెళ్లాలని, అలాగాక సీఎం ఆహ్వానించడం చెల్లదని ఆ అధికారి అన్నారు. అయితే సింగపూర్, జపాన్ ప్రధానులు రాకపోయినా ఆ దేశాలకు చెందిన కన్సల్టెంట్లు, ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.