ఓర్వలేక పనికిమాలిన విమర్శలు: హరీష్‌రావు | minister harish rao visits vemulawada | Sakshi
Sakshi News home page

ఓర్వలేక పనికిమాలిన విమర్శలు: హరీష్‌రావు

Published Tue, Sep 19 2017 1:59 PM | Last Updated on Tue, Sep 19 2017 4:46 PM

వచ్చే డిసెంబర్‌ నాటికి మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ గేట్ల నిర్మాణం పూర్తి చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల: వచ్చే డిసెంబర్‌ నాటికి మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ గేట్ల నిర్మాణం పూర్తి చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ముంపు గ్రామాలకు రావాల్సిన పరిహారం త్వరలోనే అందేవిధంగా చూస్తామన్నారు. ఈ రోజు జిల్లా వేములవాడలో పర్యటించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే డిసెంబర్‌ నాటికి మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌ను పూర్తిస్థాయిలో నింపుతాం. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొందరు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement