harisha rao
-
తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం: మంత్రి హరీష్ రావు
-
మున్సిపాలిటీల్లో ఎగిరేది గులాబీ జెండానే..
సాక్షి, సంగారెడ్డి : అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్ మున్సిపాలిటీల్లోని వార్డుల్లో అభ్యర్థులతో కలసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని సర్వేలన్నీ తేటతెల్లం చేస్తున్నా యని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని, మాయమాటలు చెప్పి ఎన్నికల సమయంలో వచ్చేవారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తమకు ఎవరితోనూ పొత్తులు లేవని, టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న వారి కారు గుర్తుకే ఓటేయాలని హరీశ్ సూచించారు. కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులు తాము గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో చేరుతామని అం టున్నట్లు తెలుస్తోందని, కారు గుర్తుపై గెలిచిన వారే తమ వారని స్పష్టం చేశారు. ఇటు 57 ఏళ్లు దాటిన వారందరికీ పెన్ష న్లుఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాల వల్ల 8 మంది అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారని చెప్పారు. ఆయన నిర్వాకం వల్లనే వారిలో నలుగురు అధికారులు చనిపోయారన్నారు. సంగారెడ్డిని ఏం అభివృద్ధి చేశాడని మళ్లీ ఓట్లు అడుగుతున్నాడని ఘాటుగా విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే సంగారెడ్డిని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. సీఏఏకు టీఆర్ఎస్ వ్యతిరేకమని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
గర్రెపల్లి చెరువుకు మంత్రి భరోసా
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలోనే అతిపెద్దదైన గర్రెపల్లి చెరువు అభివృద్ధికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు భరోసా ఇచ్చారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి పెద్ద చెరువు దుస్థితిని వివరిస్తూ ‘పెద్ద చెరువుపై చిన్న చూపు’ శీర్షికన ఈ నెల 20న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉండి, పది గ్రామాల్లో భూగర్భజల మట్టాన్ని పెంచే పెద్దచెరువు దుస్థితికి అద్దం పట్టడంతో ‘సాక్షి’ కథనం జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును సర్పంచ్ పడాల అజయ్‌గౌడ్ కలిసి వినతిపత్రం అందజేశారు. గర్రెపల్లి పెద్ద చెరువుకు వరదకాలువ నుంచి నీళ్లివ్వాలని మంత్రిని కోరారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు చెరువుల అభివృద్ధికి వెచ్చిస్తున్నా.. గర్రెపల్లి చెరువు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రికి సర్పంచ్ ఫిర్యాదు చేశారు. రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ చెరువులో నీళ్లు నింపితే, పదిగ్రామాల్లో భూగర్భ జల మట్టం పెరుగుతుందని, 300కుపైగా మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని తెలియజేశారు. ఇందుకు మంత్రి హరీష్‌రావు సానుకూలంగా స్పందించారు. చెరువులో నీళ్లు నింపేందుకు అవసరమైన మార్గాలను అధికారుల నుంచి తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. రైతులకు లాభం చేకూరేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. కాగా... మంత్రిని కలిసి వారిలో బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తంగెళ్లపల్లి రాజ్‌కుమార్, గ్రామస్తులు ఉన్నారు. నీళ్లు నింపేందుకు మంత్రి హామీ జిల్లాలోనే అతిపెద్దదైన గర్రెపల్లి చెరువును నీటితో నింపేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు. చెరువులో సరిపడా నీళ్లు లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా, పట్టించుకోవడం లేదు. దీనితో మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. రామడుగు మండలం చిప్పకుర్తి దగ్గర వరదకాలువ 99వ కిలోమీటర్ వద్ద, ఎస్ఆర్ఎస్పీ మెయిన్ కెనాల్ (96వ కిలోమీటర్ వద్ద)ను కలిపితే, దీని ద్వారా డీ–86 నుంచి 11ఆర్తో గర్రెపల్లి చెరువును నింపాలని కోరాం. మంత్రి ఆదేశంతో త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం. పడాల అజయ్‌గౌడ్, సర్పంచ్, గర్రెపల్లి -
‘గద్వాల నుంచే కేసీఆర్ పతనం’
సాక్షి, హైదరాబాద్ : గద్వాల నుంచే సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఫైర్ అయ్యారు. గద్వాల సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని, మామాఅల్లుళ్లు తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నారని అరుణ విమర్శించారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. ఎన్నికలు వస్తున్నాయని మొక్కుల పేరిట కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పరిస్థితులు అనుకూలించి ఉంటే మంత్రి హరీష్‌రావు ఎప్పుడో కాంగ్రెస్ కండువా కప్పుకునేవారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ శుక్రవారం గద్వాలలో పర్యటించిన విషయం తెలిసిందే. ‘తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. జనాలను మోసం చేసే వాళ్లు ఎవరో విజయవాడ కనకదుర్గమ్మకు బాగా తెలుసు. అమ్మవార్ల అందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న మోసాలు తెలుసు. జై తెలంగాణ అన్న వారిపై దాడి చేసిన వారికి మంత్రి పదవులిచ్చి తనకు రెండు వైపులా కూర్చోబెట్టుకుంది నీవు కాదా కేసీఆర్. తెలంగాణ వచ్చింది ప్రజలు కోసం కాదు. కేసీఆర్ కుటుంబం కోసం. మంత్రి హరీష్ రావు జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకో. పరిస్థితులు అనుకూలిస్తే కాంగ్రెస్ లోకి వచ్చేవాడివి. అలాంటి నువ్వా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది’ అంటూ డీకే అరుణ మండిపడ్డారు. -
ఓర్వలేక పనికిమాలిన విమర్శలు: హరీష్‌రావు
రాజన్న సిరిసిల్ల: వచ్చే డిసెంబర్ నాటికి మిడ్ మానేరు ప్రాజెక్ట్ గేట్ల నిర్మాణం పూర్తి చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ముంపు గ్రామాలకు రావాల్సిన పరిహారం త్వరలోనే అందేవిధంగా చూస్తామన్నారు. ఈ రోజు జిల్లా వేములవాడలో పర్యటించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే డిసెంబర్ నాటికి మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌ను పూర్తిస్థాయిలో నింపుతాం. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొందరు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. -
ప్రమాదాల నివారణకు కృషి చేద్దాం
సిద్దిపేట అర్బన్: ఈప్రపంచంలో ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదని, అలాంటి విలువైన ప్రాణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమాద రహిత రాష్ట్రంగా నిలిపేందుకు ప్రతి వాహనదారుడూ కృషి చేయాలన్నారు. డ్రైవర్‌కు తగినంత విశ్రాంతి, నిద్ర అవసరమన్నారు. విశ్రాంతి లేకుండా నిద్రమత్తులో వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. డ్రైవర్లకు జాగ్రత్తలు చెప్పడంతో పాటు వారిలో చైతన్యం నింపేందుకు ప్రతి ఏటా వారం రోజుల పాటు రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. చిన్న చిన్న నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా వెళితే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. సెల్ఫోన్లు మాట్లాడుతూ, మద్యం సేవించి, సిగరేట్ తాగుతూ వాహనాలను నడిపితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నవారవుతారని హెచ్చరించారు. ప్రయాణికుల జీవితాలు తమ చేతుల్లో ఉన్నాయనే విషయాన్ని ప్రతి డ్రైవర్ గుర్తుంచుకోవాలని సూచించారు. ఆటోలకు, వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను రద్దు చే సిన సీఎం కేసీఆర్, పాతబకాయిలు కూడా మాఫీ చేశారన్నారు. అందువల్ల పాత బకాయిలకోసం వారిని వేధించవద్దని అధికారులకు సూచించారు. రోడ్ల నిర్మాణం కోసం రూ. 25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్అండ్బీ రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ. 25 వేల కోట్లను మంజూరు చేసిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ నిధులతో ప్రతి పల్లె నుంచి మండల కేంద్రాలకు, పట్టణాలకు డబుల్ లేన్ల రోడ్లు వేస్తామని మంత్రి వెల్లడించారు. రాజీవ్ రహదారిపై రూ.800 కోట్లతో బైపాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్లు చెప్పారు. అదే విధంగా ప్రమాదాలు జరిగిన వెంటనే బాధితులకు చికిత్స అందించేందుకు ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పొన్నాల నుంచి సిద్దిపేట మీదుగా రంగీల దాబా సమీపంలోని రాజీవ్హ్రదారి వరకు ఆరు లేన్ల రోడ్డును రూ. 50 కోట్లతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాలను నివారిద్దాం... తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల వాహనాలుండగా, గత సంవత్సరం 7 వేల ప్రమాదాలు జరిగాయని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మమత ప్రసాద్ తెలిపారు. ఇక మెదక్ జిల్లాలో 2.20 లక్షల వాహనాలు ఉంటే, 700 ప్రమాదాలు నమోదయ్యాయన్నారు. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్, ఓవర్ టేక్లను నివారిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ప్రమాదాలు జరిగితే బాధితులను ఆస్పత్రుల్లో చేర్పించాలని డ్రైవర్లకు సూచించారు. రాష్ట్రాన్ని ప్రమాద రహిత రాష్ట్రంగా నిలిపి అందరి మన్ననలను పొందుదామని పిలుపునిచ్చారు. అంతకుముందు రవాణా శాఖ క్యాలెండర్లను, డైరీలను, వాసవీక్లబ్ రూపొందించిన రోడ్డు భద్రత వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావును సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్, ఆర్టీఓ ఏసురత్నం, ఎంవీఐ అశోక్‌కుమార్, సీఐలు సైదులు, ప్రసన్నకుమార్, ఎస్ఐలు, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
రుణమాఫీపై వారంలోగా నిర్ణయం
హైదరాబాద్:రుణమాఫీపై బ్యాంకర్లతో చర్చించినట్లు తెలంగాణ మంత్రులు తెలిపారు. రుణమాఫీ అంశంపై సాధ్యాసాధ్యలపై బ్యాంకర్లతో చర్చించినట్లు మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులు మంగళవారం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయనున్న రుణమాఫీ అంశంపై వారంలోగా తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తొలివిడత కొంత రుణమాఫీ చేసి.. మిగతా మూడు వాయిదాలపౌ నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతులకు బాండ్లు లేదా చెక్కుల ఇచ్చే యోచనలో ఉన్నట్లు వారు తెలిపారు. ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం బ్యాంకర్లతో చర్చిస్తుందన్నారు.