హైదరాబాద్:రుణమాఫీపై బ్యాంకర్లతో చర్చించినట్లు తెలంగాణ మంత్రులు తెలిపారు. రుణమాఫీ అంశంపై సాధ్యాసాధ్యలపై బ్యాంకర్లతో చర్చించినట్లు మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులు మంగళవారం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయనున్న రుణమాఫీ అంశంపై వారంలోగా తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తొలివిడత కొంత రుణమాఫీ చేసి.. మిగతా మూడు వాయిదాలపౌ నిర్ణయం తీసుకుంటామన్నారు.
రైతులకు బాండ్లు లేదా చెక్కుల ఇచ్చే యోచనలో ఉన్నట్లు వారు తెలిపారు. ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం బ్యాంకర్లతో చర్చిస్తుందన్నారు.