maneru project
-
చీర్లవంచ వద్ద భారీ వారధి! రాజమండ్రి తరహాలో డబుల్ వంతెనకు శ్రీకారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ వద్ద మిడ్‌మానేరు ప్రాజెక్టు మీదుగా భారీ వారధి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరినదిపై రాజమండ్రి వద్ద నిర్మించిన భారీవంతెనను స్ఫూర్తిగా తీసుకుని దీన్ని నిర్మించతలపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ నిర్మాణ బాధ్యతను పర్యవేక్షిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని బృందం.. వంతెన నిర్మాణ డిజైన్లను ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు చూపించడం, ఆయన కొన్నిటికి సూత్రప్రాయ అంగీకారం తెలిపిన నేపథ్యంలో ప్రాజెక్టు పనిని ప్రారంభించారు. డబుల్ వంతెన, ఆకట్టుకునే రూపం! ఈ వంతెన రాష్ట్రంలో మిగిలిన వంతెనల కంటే భిన్నంగా, నాణ్యమైనదిగా, డిజైన్‌లో ఆకట్టుకునేలా ఉంటుందని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. వంతెన రెండు అంతస్తులుగా ఉంటుందని, పైభాగంలో బస్సులు, లారీలు తదితరాలు వెళ్లేందుకు రోడ్డుతో కూడిన మార్గం, కింద కొత్తపల్లి–మనోహరాబాద్ రైలు వెళ్లేలా ప్రత్యేక రైల్వేట్రాక్‌తో వంతెన నిర్మిస్తామన్నారు. కేంద్రంతోపాటు, దక్షిణమధ్య రైల్వే జీఎం కూడా దీని నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి సైతం ఎంతో దోహదపడుతుందన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. రాజమండ్రి వారధిలో కింద ఉన్న రైలు వంతెన 2.8 కి.మీ.లు, కాగా పైనున్న రోడ్డు వంతెన 4.1 కి.మీ. ఉంటుంది. చీర్లవంచ వంతెనలో రైలు, రోడ్డు వంతెన ఎన్ని మీటర్లు ఉంటుందన్న సాంకేతికాంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. డబుల్ వంతెన కడితే బహుళార్థ సాధక ప్రాజెక్టు అవుతుందన్న సీఎం కేసీఆర్ సూచనలతో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఈ బ్రిడ్జి పనులకు దాదాపుగా అన్నిరకాల అనుమతులు వచ్చినట్లే. ప్రభుత్వం ఆగస్టు 15న ప్రకటించనున్న అనంతరం టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. -
మానేరు సజీవం
సాక్షి, హైదరాబాద్: గోదావరికి ఉపనదిగా ఉన్న మానేరు నదిని ఏడాదంతా పూర్తిగా సజీవం చేసే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాలకు అనుగుణంగా మొత్తంగా మానేరు నదిపై 29 చెక్‌డ్యామ్‌ల నిర్మించేలా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయగా, వాటికి టెండర్లు పిలిచి, పనులు మొదలు పెట్టే దిశగా అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. మానేరు నది మొత్తం పొడవు 180 కిలోమీటర్లు కాగా, ఇందులో 40 కిలోమీటర్ల మేర ఎప్పుడూ నీటితో ఉంటుంది. ప్రస్తుతం మరో 40 కిలోమీటర్ల మేర నదిలో నీటి నిల్వలు నిత్యం ఉండేలా 29 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని సీఎం సూచించారు. వీటికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటే మూలవాగుపై మరో 12 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి సీ ఎం గ్రీ¯Œ సిగ్నల్ ఇచ్చారు. వీటి ద్వారా 30 కిలోమీటర్ల మేర నీటి నిల్వలు పెరగనున్నా యి. మొత్తం 41 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.582 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కతేల్చారు. వీటికి పరిపాలనా అనుమతి ఇవ్వాల్సి ఉం ది. పూర్వ కరీంనగర్ జిల్లా నేతలతో ఈ చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై ప్రగతిభవ¯Œ లో అతి త్వరలోనే సమీక్ష నిర్వహించి, చర్చించిన అనంతరం వీటికి అనుమతులిచ్చే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
ఎగువ మానేరు ఎడారేనా..?
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల) : రాజన్న సిరిసిల్ల జిల్లా వరప్రదాయని ఎగువ మానేరు ప్రాజెక్టు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలోనే మొదటి చిన్నతరహ నీటి ప్రాజెక్టు. నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఆధునీకీకరణ పనులు అటకెక్కాయి. మిషన్ కాకతీయ, నీటి ప్రాజెక్టులకు వేలాది కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుండగా.. అధికారుల ఉదాసీనత ఈ ప్రాజెక్టుకు శాపంగా మారింది. వేలాది ఎకరాలకు ప్రత్యక్షంగా.. పరోక్షంగా సాగునీరందిస్తూ.. ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఎగువ మానేరుపై పాలకులు శీతకన్ను వీడాలి. ఈ ఏడాది మరమ్మతు పనులకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోందని ఎదురు చూసిన రైతన్నలకు చివరకు నిరాశే మిగిలింది. ఈ వర్షాకాలానికి ముందే పనులు పూర్తవుతాయని భావించారు. మరింత ఆయకట్టు సాగులోకి వస్తుందనకున్న అన్నదాతలకు ఎదురు చూపులే దక్కాయి. కొట్టుకుపోతున్న స్పిల్‌వే.. చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ 1945లో కూడవెళ్లి, పల్వంచ వాగులపై నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టును నిర్మించారు. 1948లో పనులు పూర్తయ్యాయి. 2టీఎంసీలతో 17వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే పనులకు శ్రీకారం చుట్టారు. కుడికాలువ ద్వారా అంటే ఇప్పటి ముస్తాబాద్ మండలానికి 10వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా గంభీరావుపేట మండలానికి 7వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. కాలక్రమంలో ప్రాజెక్టును అధికారులు పట్టించుకోలేదు. దీంతో సిల్ట్ పేరుకుపోయి నీటి సామర్థ్యం తగ్గింది. అలాగే కుడి, ఎడమ కా లువలు మట్టిలో కూరుకుపోయి చెట్లు మొలిచి నీ రు ముందుకు సాగని విధంగా తయారైంది. ఇక కుడి కాల్వలోని డిస్ట్రిబ్యూటరీ 17 వరకు షట్టర్లు ధ్వంసం అయ్యాయి. ఎడమ కాల్వలోని డీ–10 వ రకు శిథిలం అయ్యాయి. స్పిల్‌వే పై మొక్కలు మొ లిచి నెర్రెలు పెట్టింది. కొంత భాగం వరదకు కొ ట్టుకుపోయింది. చివరకు 5వేల ఎకరాలకు మాత్ర మే సాగునీరందించే ప్రాజెక్టుగా మిగిలిపోయింది. ప్రతిపాదనలకు మోక్షం కలిగేనా.. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నీటిపారుదల శాఖ అ« దికారులు ఎట్టకేలకు కుడి, ఎడమ తూముల మరమ్మతు, షట్టర్ల మరమ్మతు, కుడికాలువ పది కిలో మీటర్లు, షట్టర్లు, ఎడమ కాలువ 5 కిలోమిటర్ల కా ల్వ లైనింగ్, ముఖ్యంగా యాభై ఏళ్లుగా నిండుకు న్న సిల్ట్ తొలగింపు తదితర పనులు చేపట్టేందుకు రూ. 49 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆరునెలల క్రితం పంపించిన ప్రతిపాదనలు ఈఎస్సీ వరకు వెళ్లి ఆగినట్లు తెలుస్తోంది. ఈ వేసవిలోనే సిల్ట్ తొలగించి కనీసం 13వేల ఎకరాలకు నీరందించాలనుకున్న ప్రతిపాదనలు దాటలేదు. మళ్లీ వర్షాలు మొదలైతే ఇక సిల్ట్పనులు చేయరాదు. భారీ వర్షాలు పడితే వచ్చే వెసవి నాటికి కూడా పూడిక తీసే అవకాశాలు తక్కువే. ష ట్టర్ మరమ్మతు చేయరాదు. మరోసారి రబీలో 5వేల ఎకరాలకు మాత్రమే నీరందించే అవకాశాలున్నాయి. 9వ ప్యాకేజీలోకి గెస్ట్‌హౌస్, బోటింగ్ నిజాం నిర్మించిన గెస్ట్‌హౌజ్ శిథిలావస్థలో ఉండగా.. ఉద్యానవనం రూపు కోల్పోయింది. దీంతో అధికారులు రూ.2 కోట్లతో ఆధునిక హంగులతో గెస్ట్‌హౌస్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. టూరిజం శాఖ ఉద్యానవనం, గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపట్టనుండగా.. దీనిని కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ కింద చేపట్టనున్నారు. -
ఓర్వలేక పనికిమాలిన విమర్శలు: హరీష్‌రావు
రాజన్న సిరిసిల్ల: వచ్చే డిసెంబర్ నాటికి మిడ్ మానేరు ప్రాజెక్ట్ గేట్ల నిర్మాణం పూర్తి చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ముంపు గ్రామాలకు రావాల్సిన పరిహారం త్వరలోనే అందేవిధంగా చూస్తామన్నారు. ఈ రోజు జిల్లా వేములవాడలో పర్యటించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే డిసెంబర్ నాటికి మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌ను పూర్తిస్థాయిలో నింపుతాం. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొందరు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.