సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం | minister pocharam srinivas reddy starts tribal college The boys' Hotels | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం

Published Sun, Oct 19 2014 4:06 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం - Sakshi

సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం

* విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యతను పెంచుతాం
* సకల సౌకర్యాల కల్పన కోసం రాత్రుల్లో బసచేస్తాం
* మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

ఇందూరు : రాష్ట్రంలో 85శాతం మంది ప్రజలు బడుగు, బలహీన వర్గాలవారున్నారని గుర్తించిన ప్రభుత్వం సంక్షేమ రంగానికి మొదటి ప్రాధాన్యం ఇస్తుందని జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని హమాల్‌వాడీలో కోటి రూపాయలతో నిర్మించిన గిరిజన కళాశాల బాలుర వసతిగృహాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం శిలాఫకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్‌చేశారు. అనంతరం మంత్రి  మాట్లాడుతూ... జిల్లాలో మొదటి నూతన వసతిగృహాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.  సొంత భవనాలు లేక మారు మూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు బయట గదుల్లో అద్దెకు ఉంటూ ఇబ్బందులు పడ్డారని, ఇక ఆ ఇబ్బందులు తప్పాయన్నారు.

ఇలాంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ నూతన వసతిగృహాలు జిల్లాకు చాలా ముంజూరయ్యాయని, అవి త్వరలోనే పూర్తి కానున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు సంక్షేమ రంగాన్ని నీరుగార్చాయని ఆరోపించారు.  కేజీ టూ పీజీ విద్యనందించేందుకు ప్రతి మండలానికి 17ఎకరాల్లో పెద్ద భవనాన్ని నిర్మించబోతున్నామని, అందులో సు మారు వెయ్యి మంది విద్యార్థులకు విద్యనందించడంతో పాటు విశాలమైన వసతిని కల్పిస్తామన్నారు. సంక్షేమ వసతిగృహ విద్యార్థులకు ప్రస్తుతం అమలు చేస్తున్న మెనూ కాకుండా అందులో మార్పులు చేపట్టి సంపూర్ణ, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామన్నారు.

ఎప్పటికప్పుడు వసతిగృహాల్లో రాత్రుల్లో బస చేసి విద్యార్థుల బాగోగులు, అందుతున్న సౌకర్యాలు, ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుంటామని తెలిపారు. అనంతరం ఎస్టీ వసతిగృహా కళాశాల విద్యార్థులు కొత్త భవనంలో ఉన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కరించాలని సంబంధిత మంత్రి అధికారులను ఆదేశించారు. అయితే నిర్మించిన వసతిగృహంలో కిచెన్ షెడ్, డైనింగ్ హాల్‌ను నిర్మించలేదని తెలసుకున్న మంత్రి కాంట్రాక్టర్‌తో మాట్లాడి అందుకు గల కారణాలు తెలుసుకున్నారు. వాటి నిర్మాణాల కోసం ప్రపోజల్స్ పంపాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.
 
విద్యుత్ కోతల పాపం కాంగ్రెస్, టీడీపీలదే

రాష్ట్రంలో విద్యుత్ కోతలకు గత కారణం, పాపం గత ప్రభుత్వాలు కాంగ్రెస్, టీడీపీలదేనని మంత్రి  ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి రోజు 20కోట్లు వెచ్చించి విద్యుత్‌ను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో, రాష్ట్రంలో వర్షాధార పంటలు ఎండిపోతున్నందున వాటిపై సర్వే చేసి నష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
 
ధాన్యం కొనుగోళ్లకు అన్ని రకాల ఏర్పాట్లు
బాన్సువాడ : ఖరీఫ్‌లో జిల్లాలో 96 శాతం పంటలు సాగయ్యాయని, అన్ని రకాల పంటల కొనుగోళ్ళు, మద్దతు ధర కోసం తమ ప్రభుత్వం   చర్యలు తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 296 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చేశామన్నారు. జిల్లాలో 60 సొసైటీల పరిధిలో ఆర్‌ఐడీఎఫ్ -20 కింద గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.  రానున్న ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఆరుతడి పంటలైన మొక్కజొన్న,  సన్‌ఫ్లవర్, వేరుశనగ, మి నుము, పెసర వేయాలని మంత్రి  సూచిం చారు. రాష్ట్రంలో 18వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయనుండగా, అందులో నిజామాబాద్ జిల్లాలోనూ థర్మల్, సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement