రైతు సంక్షేమమే ప్రభుత‍్వ ధ్యేయం: పోచారం
నాగర్ కర్నూల్: జిల్లాలోని ఉర్కొండ మండలంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం పర‍్యటించారు. రేవల్లి గ్రామానికి చేరుకున్న మంత్రి పోచారం గ్రామంలో మినీ భూసార పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార‍్యక్రమంలో జిల్లా మంత్రి లక్ష్మారెడ్డి. ఉద్యానవన, వ్యవసాయ శాఖ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.
గ్రామంలో 156 మంది రైతులకు తుంపర పరికరాలు, బిందు సేద్యం పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... రైతుల సంక్షేమమే ప్రభుత‍్వ ద్యేయమన్నారు. వరైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత‍్వం సంక్షేమ కార‍్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. రైతు సమగ్ర సర్వేలో వివరాలు అందించని రైతులు వీఆర్‌వోలను, ఏవోలను కలిసి వివరాలు సమర్పించాలని సూచించారు.