
ఇజ్రాయిల్‌కు మంత్రి పోచారం బృందం
ఆగిపోయిన మంత్రి తనయుడు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మ రో ఆరుగురు సభ్యుల బృందం ఇజ్రాయిల్ పర్యటనకు సోమవారం బయలుదేరి వెళ్లింది. ఈ నెల 27 నుంచి 30 వరకు ఇజ్రాయిల్‌లో అంతర్జాతీయ వ్యవసాయ ప్రదర్శన జరుగుతుండటంతో వారు అందులో పాల్గొనేందు కు వెళ్లారు. విమర్శలు రావడంతో ఆ బృందంలోని మంత్రి కుమారుడు భాస్కర్‌రెడ్డి మాత్రం పర్యటనను విరమించుకున్నారని తెలిసింది.
అలాగే ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ప్రత్యేకాధికారి ప్రొఫెసర్ ప్రవీణ్‌రావు కూడా చివరి క్షణంలో ఆగిపోయారు. బృందంలో మంత్రితోపాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మోహన్‌రెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామ్‌రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలను ఆదర్శ రైతులుగా ఈ పర్యటనకు తీసుకెళ్తుండటం విమర్శలకు దారితీసింది.