సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థకు పకడ్భందీ చర్యలు తీసుకుందని ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడుపుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. విద్యా సంస్థల సెలవులు ముగిసి తిరిగి ప్రారంభం కాబోతున్న సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. త్వరలో 100 శాతం బస్సులు రోడ్ల మీద నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. బస్సుల్లో కండక్టర్లకు టిమ్ మిషన్లు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రయాణీకులకు తప్పని సరిగా టికెట్లు జారీ చేసేలా, వారి బస్ పాసులు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వసరానికి అనుగుణంగా బస్సు డిపోల్లో కొత్తగా మెకానిక్‌లు, ఎలక్ట్రీషీయన్లు అవసరమైతే నియమించుకోవాలని ఆర్టీసీ అధికారులకు మంత్రి సూచించారు. గంటపాటు కొనసాగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రితో పాటు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ సందీప్ సుల్తానియా, ఆర్టీవోలు, జేటీసీలు, ఈడీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment