సాక్షి, మహబూబాబాద్: భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని ఓ మహిళ ఆందోళకు దిగింది. మహబూబాబాద్ జిల్లాలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ముందు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. తన భర్త రాణాప్రతాప్ డ్రగ్స్, మద్యం ఇతర చెడు ఆలవాట్లకు బానిసగా మారాడని, తనతో కాపురానికి రావడంలేదని తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. తొలుత పోలీసులను ఆశ్రయించానని, అయినా కూడా తనకు న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పెద్ద మనుషులు కూర్చోని మాట్లాడి వివాదం పరిష్కరిస్తామని చెప్పిన ఇన్ని రోజులు గడిపారని ఆమె ఆరోపించింది. దీంతో వివాదం తీవ్రం కావడంతో ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగింది.
వివరాలు..
మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు పెద్దతండాకు చెందిన రాణాప్రతాప్ ఆయన వృత్తి రీత్యా డాక్టర్. రాణాప్రతాప్ గార్ల ఆసుపత్రిలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా మద్యానికి బానిసై తనను కాపురానికి తీసుకుపోవడంలేదని భార్య ధర్నాకు దిగింది.
Comments
Please login to add a commentAdd a comment