ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, విద్యుత్ శాఖమంత్రి జగదీశ్ రెడ్డి పరిశీలించారు.
నల్లగొండ: ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, విద్యుత్ శాఖమంత్రి జగదీశ్ రెడ్డి పరిశీలించారు. దుండగుల కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ నాగరాజుకు వారు నివాళులర్పించారు. మరోవైపు ఈ కాల్పుల ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
నల్లగొండ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావుపై వేటు వేసింది. రాత్రి పూట తనిఖీల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు పోలీసులు తీసుకోలేదని ప్రభుత్వం అభిప్రాయపడింది.