భీమదేవరపల్లి: కుటుంబసభ్యులు తిట్టారనే మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిన బాలికను ఓ మృగాడు మాయమాటలతో మభ్యపెట్టి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత వ్యభిచా ర ముఠాకు విక్రయించేందుకు యత్నించాడు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ము ల్కనూర్ ఎస్సై సోమ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎర్రబెల్లితండాకు చెందిన 8వ తరగతి విద్యార్థిని ఈ నెల 7న ఇం ట్లో జరిగిన చిన్న గొడవతో సిద్దిపేటలో బంధువుల వద్దకని వెళ్లింది.
ఇల్లు దొరకకపోవడంతో తిరిగి హన్మకొండ బస్సు ఎక్కింది. అదే బస్సు లో హుజూరాబాద్ మండలం ఎరుకలగూడెంకు చెందిన ఇజ్జగిరి శ్రీనివాస్ ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలికతో మాట్లాడగా.. జరిగిన విషయం చెప్పింది. శ్రీనివాస్ బాలికను చదివిస్తానని, తమ ఇంటికి రమ్మ ని తీసుకెళ్లాడు. బాలికను హుజూరాబాద్‌లోని ఓ రైస్‌మిల్‌లో నిర్బంధించి రెండ్రోజుల పాటు లైంగికదాడి జరిపాడు.
అనంతరం తన స్నేహితుడైన శ్రీనివాస్‌కు బాలిక విషయం చెప్పాడు. అతడు సదరు బాలికను వరంగల్ తీసుకెళ్లి కాశిబుగ్గలో వ్యభిచార గృహ నిర్వహకురాలు కవితకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. కాని బేరం కుదరక రెండ్రోజుల గడువు కోరారు. ఈ నెల 11న ఎర్రబల్లికి చెందిన సతీష్ అనే విద్యార్థికి కాశిబుగ్గ ప్రాంతంలో బాలిక కనపడింది. దీంతో, సతీష్ ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపగా అసలు విషయం బయటపడింది. ఇజ్జగిరి శ్రీనివాస్, శ్రీనివాస్, కవితలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
బాలికను వ్యభిచార ముఠాకు అమ్మేయత్నం
Published Sun, Apr 20 2014 12:12 PM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM
Advertisement
Advertisement