Bhimadevarapally
-
టీజర్ ఆకట్టుకుంది – మంత్రి కేటీఆర్
‘‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమా టీజర్ ఆకట్టుకుంది. మంచి కథాంశంతో పాటు చక్కని సందేశం ఉన్న చిత్రం అని అర్థమవుతోంది. ఈ సినిమాను తప్పకుండా చూస్తాను’’ అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ప్రొఫెసర్ నాగేశ్వర్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, అద్దంకి దయాకర్, అంజి వల్గుమాన్, రాజవ్వ, సుధాకర్ రెడ్డి, కీర్తీలత గౌడ్ నటించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. రమేష్ చె΄్పాల దర్శకత్వంలో డా.బత్తిని కీర్తిలతా గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను కేటీఆర్ విడుదల చేశారు. ‘‘ఓ మంచి విషయాన్ని రమేష్ చెప్పాల వినోదాత్మకంగా చెప్పారు’’ అన్నారు కీర్తిలతా గౌడ్. -
బూట్లు వేసుకోలేదని విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపాల్
సాక్షి, వరంగల్: బూట్లు ఎందుకు వేసుకురాలేదు అంటూ విద్యార్థులపై ప్రిన్సిపాల్ తన ప్రతాపాన్ని చూపాడు. ఏకంగా కంక కట్టెతో విచక్షణ రహితంగా కొట్టడంతో విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్క నూర్ మోడల్ స్కూల్లో బుధవారం చోటు చేసుకుంది. విద్యార్థుల కథనం ప్రకారం...మోడల్ స్కూల్లో పదవ తరగతి వరకు మొత్తం 490 మంది విద్యార్థులున్నారు. బుధవారం పాఠశాలలో ప్రార్థన అనంతరం విద్యార్థులు తమ క్లాస్‌లోకి వెళ్తన్న క్రమంలో 10వ తరగతికి చెందిన హర్షిత్, చరణ్, శ్రావణ్, రాంచరణ్, అక్షయ్‌కుమార్, హనీఫ్, ఫరూక్ అబ్దుల్‌తోపాటు 12మంది విద్యార్థులు బూట్లు వేసుకురాలేదు. గమనించిన ప్రిన్సిపాల్ ప్రణయ్‌కుమార్ వారందరిని పక్కకు నిలబెట్టి బూట్లు ఎందుకు వేసుకురాలేదని అడుగుతూ కొట్టడం ప్రారంభించాడు. ‘రేపు వేసుకువస్తాం కొట్టకండి సార్’అంటూ కన్నీరు పెట్టుకున్నప్పటికి వినకుండా విచక్షణా రహితంగా చితకబాదాబడు. దీంతో విద్యార్థుల పిరుదల కిందబాగంలో కమిలిపోయి కొంతమంది విద్యార్థులు నడవలేని పరిస్థితికి చేరుకోవడంతో కొందరు ఉపాధ్యాయులు వారిని సమీపంలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స నిర్వహించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల పాఠశాలకు చేరుకొని తమ పిల్లల్ని ఈ విధంగా కొట్టడం తగదు అంటూ ప్రిన్సిపాల్‌ని నిలదీశారు. షూస్ వేసుకురాకుంటే క్రమశిక్షణలో భాగంగా కొట్టానని, కొట్టకుంటే వారు వినరు అని ప్రిన్సిపాల్ ప్రణయ్ కుమార్ వివరణ ఇచ్చాడు. -
శారీరకంగా వాడుకొని మోసం చేశాడని..
సాక్షి, భీమరదేవరపల్లి(వరంగల్): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ సంఘటన వరంగల్ అర్భన్ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపలతికి చెందిన సంకనేని సునంద.. చంటయపల్లికి చెందిన కొన్నె రమేష్ మద్య నాలుగేళ్ల క్రితం రాంగ్ కాల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. చదవండి: ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య ఈ క్రమంలో రమేష్ ఆర్మీ జవాన్ కాగా సెలవుల్లో ఇంట్లికి వచ్చినపుడల్లా ఇరువురు కలుసుకునేవారు. అయితే తనను పెళ్లి చేసుకుంటాని నమ్మబలకడంతో దగ్గరయ్యానని బాధితురాలు తెలిపింది. ఇటీవల తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రమేష్ ఇంటికికి వెళ్లగా వేరే అమ్మాయితే నిశ్చితార్థం జరిగినట్లు తెలిసిందని చెప్పింది. తనకు రమేష్‌తో వివాహం జరిపించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని మౌన పోరాటానికి దిగింది. విషయం తెలుసుకున్న ముల్కనూర్ ఎస్సై రాజ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని రమేష్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. యువతి మౌన పోరాటానికి మద్దతు తెలిపారు. చదవండి: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, వరంగల్ అర్బన్ : పరీక్షలు ఫెయిల్ కావడంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వంగర ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం వంగర గ్రామానికి చెందిన వొల్లాల రమేష్–రాణి దంపతుల రెండో కుమారుడైన వొల్లాల నిశాంత్(21) హైదరాబాద్‌లో బీటెక్ తృతీయ సంవత్సరం చదవుతున్నాడు. ఇటీవల కాలేజీ నుంచి ఇంటికొచ్చాడు. సప్లిమెంటరీ ఫలితాల్లో ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున నిశాంత్ తండ్రి రమేష్ పని నిమిత్తం హైదరాబాద్‌కు, తల్లి వ్యవసాయ పనుల కోసం బావి వద్దకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నిశాంత్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుని మృతదేహంపై పడి తల్లిదండ్రులు రమేష్, రాణి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
బాలికను వ్యభిచార ముఠాకు అమ్మేయత్నం
భీమదేవరపల్లి: కుటుంబసభ్యులు తిట్టారనే మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిన బాలికను ఓ మృగాడు మాయమాటలతో మభ్యపెట్టి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత వ్యభిచా ర ముఠాకు విక్రయించేందుకు యత్నించాడు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ము ల్కనూర్ ఎస్సై సోమ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎర్రబెల్లితండాకు చెందిన 8వ తరగతి విద్యార్థిని ఈ నెల 7న ఇం ట్లో జరిగిన చిన్న గొడవతో సిద్దిపేటలో బంధువుల వద్దకని వెళ్లింది. ఇల్లు దొరకకపోవడంతో తిరిగి హన్మకొండ బస్సు ఎక్కింది. అదే బస్సు లో హుజూరాబాద్ మండలం ఎరుకలగూడెంకు చెందిన ఇజ్జగిరి శ్రీనివాస్ ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలికతో మాట్లాడగా.. జరిగిన విషయం చెప్పింది. శ్రీనివాస్ బాలికను చదివిస్తానని, తమ ఇంటికి రమ్మ ని తీసుకెళ్లాడు. బాలికను హుజూరాబాద్‌లోని ఓ రైస్‌మిల్‌లో నిర్బంధించి రెండ్రోజుల పాటు లైంగికదాడి జరిపాడు. అనంతరం తన స్నేహితుడైన శ్రీనివాస్‌కు బాలిక విషయం చెప్పాడు. అతడు సదరు బాలికను వరంగల్ తీసుకెళ్లి కాశిబుగ్గలో వ్యభిచార గృహ నిర్వహకురాలు కవితకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. కాని బేరం కుదరక రెండ్రోజుల గడువు కోరారు. ఈ నెల 11న ఎర్రబల్లికి చెందిన సతీష్ అనే విద్యార్థికి కాశిబుగ్గ ప్రాంతంలో బాలిక కనపడింది. దీంతో, సతీష్ ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపగా అసలు విషయం బయటపడింది. ఇజ్జగిరి శ్రీనివాస్, శ్రీనివాస్, కవితలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.