మధ్యప్రదేశ్ తాగునీటి శాఖ అధికారుల బృందం కితాబు
సాక్షి, హైదరాబాద్: మెదక్–సింగూరు సెగ్మెంట్ మిషన్ భగీరథ పనులను మధ్య ప్రదేశ్ తాగునీటి శాఖ అధికారుల బృందం బుధవారం పరిశీలించింది. ఓ ప్రభుత్వ పథకానికి సంబంధించిన పనులు ఇంత వేగంగా పూర్తవడాన్ని చూడటం ఇదే తొలి సారని పేర్కొంది. ముందుగా మెదక్ జిల్లా పెద్దారెడ్డిపేట వద్ద నిర్మిస్తున్న ఇంటెక్ వెల్, హెడ్ వర్క్స్ పనులను పరిశీలించింది.
నాణ్యతతో పనులు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర జల నిగమ్ మర్యాదిత్ చీఫ్ జనరల్ మేనేజర్ ఏకే శ్రీవాత్సవ ప్రశంసించారు. తర్వాత సంగారెడ్డి జిల్లా బుస్సారెడ్డిపేట వద్ద నిర్మిస్తున్న ఇంటెక్ వెల్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులను పరిశీలించారు. ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీటిని అందించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆశయం గొప్పదని కొనియాడారు.